News April 5, 2025
తిలక్ వర్మ రిటైర్డ్ ఔట్‌పై కోచ్ ఏమన్నారంటే?

LSGతో మ్యాచ్‌లో MI బ్యాటర్ తిలక్ వర్మ రిటైర్డ్ ఔట్ నిర్ణయం చర్చనీయాంశమైన వేళ కోచ్ జయవర్దనే స్పందించారు. ‘సూర్య ఔట్ అయినా అప్పటికే క్రీజులో కుదురుకున్న తిలక్ రన్స్ చేస్తాడని చివరి ఓవర్ల వరకు వేచి చూశాం. కానీ, అతను బ్యాటింగ్ చేసేందుకు ఇబ్బంది పడ్డారు. దీంతో చివరకు కొత్త బ్యాటర్ అవసరమని భావించి ఆ నిర్ణయం తీసుకున్నాం. క్రికెట్లో ఇలాంటి ఘటనలు జరుగుతాయి. ఆ సమయంలో అది వ్యూహాత్మక నిర్ణయం’ అని అన్నారు.
Similar News
News November 5, 2025
నేడు తులసి పూజ ఎందుకు చేయాలి?

కార్తీక పౌర్ణమి రోజునే తులసీ మాత భూమిపైకి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈరోజు తప్పకుండా తులసికి గంగాజలంతో పూజ చేయాలంటారు పండితులు. ఫలితంగా భోగభాగ్యాలు కలుగుతాయని నమ్మకం. తులసి కోట వద్ద దీపారాధన చేసి, దీపదానం చేస్తే.. లక్ష్మీ దేవి సంతోషించి, కటాక్షాన్ని ప్రసాదిస్తుందట. అంతేకాక, పసుపు పూసిన నాణాన్ని ఎరుపు వస్త్రంలో ఉంచడం వలన కుటుంబంలో సంపదలు పెరిగి, అందరూ ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం.
News November 5, 2025
అనూరాధ కార్తెలో అనాథ కర్రయినా ఈనుతుంది

అనూరాధ కార్తె(నవంబర్) సమయంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. ఈ కాలంలోని అనుకూలమైన వాతావరణ పరిస్థితులు, ముఖ్యంగా వర్షాలు, వ్యవసాయానికి ఎంతగానో తోడ్పడతాయి. సాధారణంగా ఫలవంతం కాని లేదా పనికిరాని మొక్క (కర్ర) కూడా ఈ కార్తెలో విపరీతమైన దిగుబడిని ఇస్తుందని.. ఈ సమయంలో రైతులు మంచి పంట దిగుబడిని ఆశించవచ్చనే విషయాన్ని ఈ సామెత నొక్కి చెబుతుంది.
News November 5, 2025
కార్తీక పౌర్ణమి.. ఈరోజు ఉపవాసం ఉండాలా?

కార్తీక పౌర్ణమి ఎంతో విశిష్టమైనది. ‘ఇవాళ తె.జా.4.52-ఉ.5.44 మధ్య నదీ స్నానం చేసి, వెంటనే కార్తీక దీపాలు వదలాలి. ఉపవాసం ఉండాలి. ఆహారం తీసుకోకుండా ఉండలేనివారు పాలు, పండ్లు తీసుకోవడం మేలు. సత్యనారాయణస్వామి కథ వినడం లేదా చదవడం శుభప్రదం. సాయంత్రం శివాలయాలు, విష్ణు మందిరాల్లో 365వత్తులతో దీపారాధన చేయాలి. ఇందుకు సా.5.15-రా.7.05 మధ్య మంచి సమయం. దీపారాధన తర్వాత ఉపవాసం విరమించాలి’ అని పండితులు చెబుతున్నారు.


