News April 5, 2025
వికారాబాద్: 19 ప్రభుత్వ పాఠశాలల్లో AI తరగతులు

వికారాబాద్ జిల్లాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను పలు ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడానికి జిల్లాలోని 19 ప్రభుత్వ పాఠశాలల్లో AI తరగతులను అందుబాటులోకి తెచ్చారు. విద్యార్థులు చదవడం, రాయడం సులభంగా నేర్చుకునేందుకు AI తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
Similar News
News January 16, 2026
2034 వరకు ప్రభుత్వాన్ని కొనసాగిస్తాం: సీఎం

TG: తాను ఓడిపోయిన వారి గురించి మాట్లాడదలుచుకోలేదని సీఎం రేవంత్ పరోక్షంగా కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘నాకిచ్చిన బాధ్యతతో పని చేయాలి అనుకుంటున్నా. ఇతరుల గురించి మాట్లాడి టైమ్ వేస్ట్ చేయను. రాబోయే ఎన్నికలతో పాటు 2034 వరకు ప్రభుత్వాన్ని కొనసాగిస్తాం’ అని నిర్మల్ సభలో స్పష్టం చేశారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరిస్తామని హామీ ఇచ్చారు.
News January 16, 2026
టోల్ ప్లాజాల దగ్గర ఇక నో క్యాష్ పేమెంట్స్?

వంద శాతం డిజిటల్ టోలింగ్ దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. టోల్ ప్లాజాల దగ్గర క్యాష్ పేమెంట్స్‌ను పూర్తిగా నిలిపేసి కేవలం FASTag లేదా UPI ద్వారానే వసూలు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ యోచిస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. చిల్లర సమస్యలు, ట్రాఫిక్ జామ్‌లకు స్వస్తి పలకడమే లక్ష్యంగా ఈ మార్పు తీసుకురానున్నారు. దీనిపై ఇంకా అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు.
News January 16, 2026
కల్వకుర్తిని మాజీ మంత్రి జైపాల్ రెడ్డి పేరుతో జిల్లా చేయాలి

కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి పేరుతో కల్వకుర్తి, ఆమన్‌గల్ కలిపి నూతన జిల్లా ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి శుక్రవారం బీజేపీ రాష్ట్ర నేత ఆచారి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో మాజీ మంత్రి జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, పలువురు నాయకులు పాల్గొన్నారు.


