News April 5, 2025

హన్మకొండ వాసులూ.. APPLY చేశారా..?

image

నిరుద్యోగుల కోసం రాజీవ్ యువవికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 14 వరకు గడువుంది. జూన్ 2 నుంచి 9 వరకు అర్హులకు మంజూరు పత్రాలు ఇస్తారు. లబ్ధిపొందిన వారికి నెల వరకు శిక్షణ ఇవ్వనున్నారు. ఆధార్, రేషన్ కార్డ్, క్యాస్ట్ & ఇన్‌కమ్ సర్టిఫికెట్స్‌తో ఆన్‌లైన్‌లో అప్లై చేసి హార్డ్ కాపీలను హన్మకొండ జిల్లాలోని మీ MPDO ఆఫీస్‌లో ఇవ్వాలి. SHARE

Similar News

News April 6, 2025

ట్రెండింగ్‌లో #GetOutModi

image

కేంద్ర నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కొందరు తమిళ నెటిజన్లు Xలో ‘గెట్ ఔట్ మోదీ’ హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టులు చేస్తున్నారు. డీలిమిటేషన్‌తో తమ ప్రాధాన్యం తగ్గిస్తున్నారని, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీతో హిందీని రుద్దాలని చూస్తున్నారని ఆక్షేపిస్తున్నారు. నార్త్, సౌత్ స్టేట్స్‌ మధ్య నిధుల కేటాయింపులో తేడాలపై ప్రశ్నిస్తున్నారు. ఇవాళ పాంబన్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి PM వెళ్తున్న నేపథ్యంలో #GetOutModi ట్రెండవుతోంది.

News April 6, 2025

కరీంనగర్ జిల్లాలో ఉష్ణోగ్రతల వివరాలు

image

కరీంనగర్ జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా కరీంనగర్ జిల్లా కేంద్రం, ఇల్లందకుంట మండలంలో 40.1°C నమోదు కాగా, జమ్మికుంట 40.0, మానకొండూర్ 39.9, గంగాధర 39.8, రామడుగు 39.6, చొప్పదండి 39.4, కొత్తపల్లి 39.3, చిగురుమామిడి 39.2, వీణవంక 39.1, సైదాపూర్ 39.0, గన్నేరువరం 38.9, శంకరపట్నం 38.7, తిమ్మాపూర్ 38.5, హుజూరాబాద్ 38.4, కరీంనగర్ రూరల్ 38.3°C గా నమోదైంది.

News April 6, 2025

మెదక్: ఇద్దరు యువకుల గల్లంతు

image

మెదక్ మండలం బాలానగర్ మత్తడిలో స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. గ్రామస్థుల వివరాల ప్రకారం.. తుడుం నవీన్(21), తుడుం అనిల్(22) శనివారం సాయంత్రం స్నానానికి వెళ్లారు. ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు వెతకగా ఈరోజు ఉదయం చెరువు కట్టపై చెప్పులు, బట్టలు కనిపించాయి. దీంతో యువకుల కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు.

error: Content is protected !!