News April 5, 2025

విశాఖ: ఉరేసుకుని విశ్రాంత ఉద్యోగి మృతి

image

విశాఖలోని లాసన్స్‌బే కాలనీలో విశ్రాంత ఉద్యోగి గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కాలనీకి చెందిన డానియల్ మిల్టన్(64) ఏలూరు జిల్లా కోపరేటివ్ బ్యాంకులో జాయింట్ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహించి, జూన్ 2024లో పదవీ విరమణ పొందారు. అనంతరం మిల్టన్‌కు అందాల్సిన ప్రయోజనాలు అందలేదని, మనస్తాపానికి గురై ఉరేసుకున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News April 13, 2025

విశాఖ: స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

విశాఖ జిల్లా షెడ్యూల్డు కులాల సేవా సహకార సంస్థ 2025-26 ఆర్ధిక సంవత్సరంకు ఎస్.సి.నిరుద్యోగ యువతకు 16.88 కోట్ల రూపాయలతో వివిధ స్వయం ఉపాధి పథకాలను అమలు చేయడానికి ఆమోదం తెలిపిందని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ శనివారం తెలిపారు. https://apobmms.apcfss.in లో ఏప్రిల్ 14నుంచి మే 10లోపు బిపిఎల్ కుటుంబాలు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.  పూర్తి వివరాలకు వెబ్సైట్‌లో చూడాలని అన్నారు.

News April 12, 2025

ఇంటర్ రిజల్ట్స్.. విశాఖకు 4వ స్థానం

image

ఇంటర్ ఫలితాల్లో విశాఖ విద్యార్థులు సత్తా చాటారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 40,098 మంది పరీక్షలు రాయగా 31,866 మంది ఉత్తీర్ణులయ్యారు. 79% పాస్ పర్సంటేజీతో విశాఖ జిల్లా రాష్ట్రంలోనే 4వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 36,479 మందికి 31,761 మంది పాస్ కాగా 87% పాస్ పర్సంటేజీతో 6వ స్థానంలో నిలిచింది.

News April 12, 2025

విశాఖ: నేడే ఇంటర్ ఫలితాలు

image

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. ఈరోజు ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. విశాఖ జిల్లాలో ఫస్టియర్ 42,257 మంది, సెకండియర్ 40,744 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 83,001 మంది పరీక్షలు రాశారు. ఒకప్పుడు రిజల్ట్స్ కోసం నెట్ సెంటర్ల చుట్టూ తిరిగేవారు. నేడు సెల్‌ఫోన్‌లోనే చూసుకుంటున్నారు. రిజల్ట్స్ వెతికేందుకు టెన్షన్ పడొద్దు.. వే2న్యూస్ యాప్‌లో ఈజీగా చెక్ చేసుకోవచ్చు.

error: Content is protected !!