News April 5, 2025

రేపు అక్కడ వైన్స్ బంద్

image

TG: శ్రీరామనవమి సందర్భంగా రేపు ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు మద్యం దుకాణాలు మూసేయాలని HYD రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఉత్తర్వులు జారీ చేసింది. కమిషనరేట్ పరిధిలోని కల్లు దుకాణాలు, రెస్టారెంట్లు, బార్లు, మిలిటరీ క్యాంటీన్లు, స్టార్ హోటళ్లు, రిజిస్టర్ క్లబ్బులకు ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపింది. నగరంలో శాంతి భద్రతల దృష్ట్యా తీసుకున్న నిర్ణయాన్ని విధిగా పాటించాలని కోరింది.

Similar News

News April 6, 2025

శ్రీరామ నవమి రోజునే రాముని కళ్యాణం ఎందుకంటే?

image

శ్రీరామచంద్రమూర్తి చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో అభిజిత్ ముహుర్తంలో జన్మించారు. ఆయన వివాహం ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో యుక్త వైశాఖ శుద్ధ దశమి రోజున జరిగింది. అవతార పురుషులు జన్మించిన తిథి నాడే, ఆ నక్షత్రంలోనే వివాహం చేయాలనేది శాస్త్రాల నియమం. అందుకే శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం చేస్తారు. కాగా సీతాసమేతంగా శ్రీరాముడి పట్టాభిషేకం ఇదే రోజున జరిగిందని పురాణాలు చెబుతున్నాయి.

News April 6, 2025

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు GOOD NEWS

image

AP: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. అలాగే ఉన్నత చదువులు కలిగిన ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పిస్తామని చెప్పారు. ఖాళీలు ఎక్కువగా ఉండటంతో మిగిలిన ఉద్యోగులపై భారం పడుతోందని, దీన్ని తగ్గించేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

News April 6, 2025

‘CID’ ACP ప్రద్యుమన్ పాత్ర ముగింపు.. షాక్‌లో ఫ్యాన్స్

image

ఫేమస్ హిందీ టీవీ షో ‘సీఐడీ’ తెలుగులోనూ చాలామందికి సుపరిచితమే. ఇందులో ప్రధాన పాత్రధారి ఏసీపీ ప్రద్యుమన్ మృతిచెందారని సోనీ టీవీ ట్వీట్ చేసింది. ఆ పోస్ట్ చూసిన చాలామంది పాత్ర పోషించిన శివాజీ సాటమ్ చనిపోయారనుకుని పొరబడ్డారు. షో హిట్ అవ్వడానికి ప్రధాన కారణమైన శివాజీని ఎందుకు తొలగించారంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఓ ప్రముఖ నటుడు కొత్త ఏసీపీగా నటించనున్నట్లు సమాచారం.

error: Content is protected !!