News April 5, 2025

పవన్ భద్రాచలం పర్యటన రద్దు!

image

TG: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ <<15997275>>భద్రాచలం పర్యటనకు<<>> భద్రత కల్పించలేమని తెలంగాణ పోలీసులు తెలిపారు. రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉన్న నేపథ్యంలో రద్దు చేసుకోవాల్సిందిగా సూచించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ప్రకటన జారీ చేశారు. కాగా ఇవాళ సాయంత్రం పవన్ భద్రాచలం వెళ్లాల్సి ఉంది.

Similar News

News April 6, 2025

పిఠాపురంలో టీడీపీ నేతలపై కేసు

image

AP: పిఠాపురంలో ఎమ్మెల్సీ నాగబాబు <<15990895>>పర్యటన సందర్భంగా <<>>జనసేన, టీడీపీ వర్గీయుల మధ్య బలప్రదర్శన వాగ్వాదానికి దారి తీసింది. తనను దూషించారని జనసేన నేత ఫిర్యాదుతో చినజగ్గంపేటకు చెందిన TDP నేతలపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.

News April 6, 2025

లోకేశ్ సొంత ఇలాకాలో ‘గంజాయి’: YCP

image

AP: మంత్రి లోకేశ్ సొంత ఇలాకా మంగళగిరిలో గంజాయి పట్టుబడిందని YCP ట్వీట్ చేసింది. ‘కాలేజీ విద్యార్థులే లక్ష్యంగా గంజాయిని విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 1.2kgs గంజాయి, 8.71gms డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. ఒక్క చోట పట్టుకున్న గంజాయే ఇంత ఉంటే రాష్ట్రంలో ఎంత ఉందో? 100 రోజుల్లో గంజాయి లేకుండా చేస్తానని లోకేశ్ బీరాలు పలికారు. మరి అధికారంలోకి వచ్చి 100 రోజులు కాలేదా’ అని విమర్శించింది.

News April 6, 2025

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తల్లి కన్నుమూత

image

బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తల్లి కిమ్ ఫెర్నాండెజ్ కన్నుమూశారు. గుండెపోటుకు గురై గత కొన్ని రోజులుగా ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఇవాళ తుది శ్వాస విడిచారు. కిమ్ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఆమెను జాక్వెలిన్ దగ్గరుండి చూసుకున్నారు. ఇటీవల ఐపీఎల్ ప్రారంభోత్సవంలో పాల్గొనాల్సి ఉన్నా తల్లి కోసం రద్దు చేసుకున్నారు. కిమ్ ఫెర్నాండెజ్‌కు మొత్తం నలుగురు సంతానం.

error: Content is protected !!