News April 5, 2025
శిల్పకళా సంపద అద్భుతం: వరంగల్ సీపీ

కాకతీయ సామ్రాజ్యమైన ఓరుగల్లు కోటను శుక్రవారం సాయంత్రం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ కుటుంబ సభ్యులు తిలకించారు. కళాఖండాలను, వాటి చరిత్రను పర్యాటకశాఖ గైడ్ రవి యాదవ్ వారికి వివరించారు. కళా తోరణాల మధ్యలో ఉన్న శిల్పకళా సంపదను చూసి అద్భుతం అని కొనియాడారు. కుష్మహల్, ఏకశిల కొండ, స్వయంభు దేవాలయం, శృంగారపు బావి, అనంతరం సౌండ్ అండ్ లైట్‌షో తిలకించారు.
Similar News
News April 6, 2025
WGL: పల్లి గింజపై శ్రీరాముని ప్రతిమ

వరంగల్ నగరంలోని కాశిబుగ్గకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ కుసుమ లింగమూర్తి మరోసారి తన ప్రతిభ చాటారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని పల్లి గింజపై శ్రీరాముని ప్రతిమను చిత్రీకరించారు. ఈ సందర్భంగా పలువురు అభినందిస్తున్నారు. గతంలో ఆయన శనిగపప్పుపై వివేకానందుడు, పల్లికాయపై వినాయకుడి ప్రతిమలను గీసి ఔరా అనిపించారు.
News April 6, 2025
HNK: వ్యభిచార గృహంపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి

వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మహిళతో పాటు వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ రంజిత్ కుమార్ తెలిపారు. హనుమకొండ బాలసముద్రం అంబేడ్కర్ నగర్‌కు చెందిన రాజీవ్(32) గవిచర్ల రోడ్డులోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. కాశికుండకు చెందిన ఆటో డ్రైవర్ పరారీలో ఉన్నాడు. వారి వద్ద నుంచి 2 ఫోన్‌లు, రూ.1500 స్వాధీనం చేసుకున్నారు.
News April 6, 2025
వరంగల్: జాబ్ మేళా పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి

వరంగల్ జిల్లా నిరుద్యోగ యువతీయువకులకు ఈ నెల 11న టాస్క్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేస్తున్న మెగా జాబ్ మేళా పోస్టరును కలెక్టర్ సత్య శారదా దేవి, మేయర్ గుండు సుధారాణితో మంత్రి సురేఖ శనివారం ఆవిష్కరించారు. జిల్లాలో నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. జిల్లా పర్యటనలో భాగంగా జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.