News April 5, 2025
ముదినేపల్లి: రోడ్డు ప్రమాదంలో విద్యార్ధి మృతి

కాకినాడ(D) గండేపల్లి హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ డిగ్రీ విద్యార్థి బాడవుల కేదార్ మణికంఠ(21) చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. గండేపల్లి ఎస్సై శివ నాగబాబు వివరాల ప్రకారం.. ఏలూరు(D) ముదినేపల్లికి చెందిన మణికంఠ రాజమండ్రిలో చదువుతున్నాడు. ఫ్రెండ్ విష్ణువర్ధన్‌తో కలిసి బిర్యానీ తినేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా గండేపల్లి శివారులో ఎదురుగా వస్తున్న బైకు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.
Similar News
News April 6, 2025
గుత్తి: యువకుడిపై దూసుకెళ్లిన ట్రాక్టర్

గుత్తి మండలం చెర్లోపల్లి గ్రామ సమీపంలో పండగ రోజు ఆదివారం విషాదం చోటుచేసుకుంది. పెద్దొడ్డి గ్రామానికి చెందిన విజయ్ (18) ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడటంతో మృతి చెందాడు. రాళ్లు తీసుకురావడానికి కూలీలతో కలిసి వెళ్లాడు. రాళ్లు వేస్తున్న సమయంలో కింద నిలుచొని ఉన్న విజయ్‌పై ట్రాక్టర్ దూసుకెళ్లింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News April 6, 2025
అమరావతి: వేగంగా గ్లోబల్ మెడ్‌టెక్ ఇన్‌స్టిట్యూట్ నిర్మాణ పనులు

ఏపీ మెడ్‌టెక్‌జోన్ ప్రాంగణంలో గ్లోబల్ మెడ్‌టెక్ ఇన్‌స్టిట్యూట్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఇది మరో ప్రతిష్ఠాత్మక నిర్మాణంగా నిలుస్తోంది. పూర్తిస్థాయిలో నిర్మాణం పూర్తయిన తర్వాత ఇది రాష్ట్రానికి, దేశానికి సాంకేతిక వైద్య పరికరాల రంగంలో మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. ఈ నిర్మాణం పూర్తయితే ఎలా ఉంటుందో అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
News April 6, 2025
కామారెడ్డి జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు

జిల్లా వ్యాప్తంగా శనివారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు అధికారులు వెల్లడించారు అత్యధికంగా బిచ్కుందలో 39.9డిగ్రీలు, మద్నూర్ 39.8, నస్రుల్లాబాద్ 39.5, నిజాంసాగర్ 39, బాన్సువాడ, సదాశివనగర్, డోంగ్లిలో 38, భిక్నూర్ 37.9, పిట్లంలో 37.7 ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.