News April 5, 2025
400 ఎకరాల్లోకి ప్రవేశిస్తే చర్యలే..!: DCP

రాష్ట్రాన్ని కదిలించిన కంచ గచ్చిబౌలి 400 ఎకరాల భూవివాదంపై HYD మాదాపూర్ డీసీపీ వినీత్ కీలక నోటీసు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలు కఠినంగా అమలవుతాయని పేర్కొన్నారు. నేటి నుంచి ఏప్రిల్ 16 వరకు 400 ఎకరాల భూమిలో సంబంధిత పనులు కోసం ప్రవేశం నిషేధించినట్లు పేర్కొన్నారు. అతిక్రమిస్తే చట్టం ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Similar News
News April 6, 2025
త్రిపురాన విజయ్‌తో ముచ్చటించిన ధోనీ

టెక్కలికి చెందిన యువ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ త్రిపురాన విజయ్‌తో ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ప్లేయర్ ధోనీ ముచ్చటించారు. చపాక్ స్టేడియం వేదికగా శనివారం జరిగిన చెన్నై సూపర్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ధోనీని విజయ్ కలిశారు. ఈ సందర్భంగా మొదటిసారి ఐపీఎల్‌కు ఎంపికైన విజయ్ను ధోనీ అభినందించారు.
News April 6, 2025
కొలిమిగుండ్లలో పండగ పూట విషాదం

కొలిమిగుండ్ల మండలం నందిపాడు గ్రామంలో శ్రీరామ నవమి రోజు విషాదం నెలకొంది. నందిపాడుకు చెందిన నాగార్జున(16) పదో తరగతి విద్యార్థి బైక్‌పై తిమ్మనాయినిపేట నుంచి స్వగ్రామానికి వస్తుండగా పొలాల్లో నుంచి దున్నపోతు అడ్డుగా వచ్చి ఢీకొట్టింది. దీంతో నాగార్జున అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News April 6, 2025
ఆశ్చర్యకరంగా ధోనీ బ్యాటింగ్ గణాంకాలు

ఫినిషర్‌గా గతంలో CSKని ఎన్నో మ్యాచుల్లో గెలిపించిన ధోనీ ప్రస్తుతం తడబడుతున్నారు. నిన్న DCతో జరిగిన మ్యాచే ఇందుకు నిదర్శనం. 2023 సీజన్ నుంచి CSK ఓడిన 14 మ్యాచుల్లో 90.66 avgతో 272 రన్స్ చేసిన ఆయన, జట్టు గెలుపొందిన 13 మ్యాచుల్లో 13.80avgతో 69 రన్స్ మాత్రమే చేశారు. గెలిచిన మ్యాచుల్లో చేసిన రన్స్ కంటే ఓడిన మ్యాచుల్లో చేసిన పరుగులే ఎక్కువగా ఉండటం గమనార్హం.