News April 5, 2025
దిగ్వేశ్‌కు మళ్లీ ఫైన్.. ఈసారి ఏకంగా!

LSG బౌలర్ దిగ్వేశ్ రాఠీకి BCCI మళ్లీ <<15965200>>ఫైన్<<>> విధించింది. నిన్న MIతో మ్యాచ్‌లో వికెట్ తీసిన అనంతర మరోసారి ‘నోట్‌బుక్’ సెలబ్రేషన్ చేసుకోవడంతో <<15965793>>మ్యాచ్ ఫీజు<<>>లో 50% కోత, 2 డీమెరిట్ పాయింట్లు విధించింది. దిగ్వేశ్‌కు ఇలా ఫైన్ పడుతుండటంతో సీజన్ చివరకు వేలంలో వచ్చిన డబ్బు ఫైన్లు కట్టడానికే సరిపోతుందని మీమ్స్ పేలుతున్నాయి. మరోవైపు కెప్టెన్ పంత్‌కూ స్లోఓవర్ రేట్ కారణంగా రూ.12లక్షల ఫైన్ పడింది.
Similar News
News April 6, 2025
ధోనీ రిటైర్మెంట్‌పై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

CSK స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోనీ 2023 ఐపీఎల్ సీజన్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాల్సిందని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ అన్నారు. ఆ సమయంలో ప్రకటన చేసి ఉంటే ఘనంగా వీడ్కోలు దక్కేదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కీపింగ్ అదరగొడుతున్నా ఆయన బ్యాటింగ్ తీరుపై చెన్నై అభిమానులే అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కాగా నిన్నటి మ్యాచుతోనే ధోనీ వీడ్కోలు పలుకుతారని ప్రచారం జరిగినా కోచ్ ఫ్లెమింగ్ అలాంటి లేదన్నారు.
News April 6, 2025
పిఠాపురంలో టీడీపీ నేతలపై కేసు

AP: పిఠాపురంలో ఎమ్మెల్సీ నాగబాబు <<15990895>>పర్యటన సందర్భంగా <<>>జనసేన, టీడీపీ వర్గీయుల మధ్య బలప్రదర్శన వాగ్వాదానికి దారి తీసింది. తనను దూషించారని జనసేన నేత ఫిర్యాదుతో చినజగ్గంపేటకు చెందిన TDP నేతలపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.
News April 6, 2025
లోకేశ్ సొంత ఇలాకాలో ‘గంజాయి’: YCP

AP: మంత్రి లోకేశ్ సొంత ఇలాకా మంగళగిరిలో గంజాయి పట్టుబడిందని YCP ట్వీట్ చేసింది. ‘కాలేజీ విద్యార్థులే లక్ష్యంగా గంజాయిని విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 1.2kgs గంజాయి, 8.71gms డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. ఒక్క చోట పట్టుకున్న గంజాయే ఇంత ఉంటే రాష్ట్రంలో ఎంత ఉందో? 100 రోజుల్లో గంజాయి లేకుండా చేస్తానని లోకేశ్ బీరాలు పలికారు. మరి అధికారంలోకి వచ్చి 100 రోజులు కాలేదా’ అని విమర్శించింది.