News April 5, 2025

అల్లూరి జిల్లాలో ఎటపాక ఫస్ట్, మారేడుమిల్లి లాస్ట్

image

అల్లూరి జిల్లాలో ఉపాధి హామీ పనులు 2024-25 ఆర్థిక సం.లో లక్ష్యానికి మించి(164% ) పని దినాలు కల్పించడంలో ఎటపాక మండలం ప్రథమంగా నిలిచిందని డ్వామా పిడి విద్యాసాగర్ తెలిపారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో జరుగుతున్న ఉపాధి పనులను శనివారం పరిశీలించారు. ద్వితీయ స్థానంలో రాజవొమ్మంగి(134%), చివరి స్థానంలో మారేడుమిల్లి(86%) మండలాలు ఉన్నాయని తెలిపారు.

Similar News

News April 6, 2025

భద్రాద్రిలో ముగిసిన CM రేవంత్ రెడ్డి పర్యటన

image

సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం, తాళ్ల గుమ్మూరు గ్రామంలో గిరిజన కుటుంబంలో భోజనాలు చేసిన అనంతరం బీపీఎల్‌లో ఏర్పాటు చేసిన హెలీ ప్యాడ్ గ్రౌండ్ నుంచి హెలికాప్టర్ ద్వారా హైదరాబాదుకు బయలుదేరారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఇతర శాఖల అధికారులు సీఎంకు ఘనంగా వీడ్కోలు పలికారు.

News April 6, 2025

పిఠాపురం: రాముడు చెంతకు రామచిలుక

image

పిఠాపురం పట్టణం చిట్టోడి తోటలో కొలువైన విద్యా గణపతి శ్రీ కోదండరామ ఆలయంలో శ్రీరామ నవమి కళ్యాణ మహోత్సవం జరుగుతుండగా అద్బుత సంఘటన చోటు చేసుకుంది. రామచిలక రాముడి వద్దకు చేరుకుంది. కళ్యాణ మహోత్సవం జరుగుతుండగా రాముల వారి విగ్రహం ఎడమ భుజంపై వాలి కళ్యాణ మహోత్సవం జరిగేంత వరకు ఉంది. ఇదే దేవాలయంలో పది సంవత్సరాల క్రితం కళ్యాణ మహోత్సవానికి రామచిలక వచ్చిందని స్థానిక ప్రజలు తెలిపారు. 

News April 6, 2025

సీతారాముడికి చిత్తూరు ఎస్పీ పూజలు 

image

చిత్తూరు నగరంలోని పోలీస్ క్వార్టర్స్‌లో ఉన్న సీతారామ ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఎస్పీ మణికంఠ కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ శివానంద కిషోర్, రాజశేఖర్ రాజు, డీఎస్పీ సాయినాథ్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

error: Content is protected !!