News April 5, 2025

పీరియడ్స్ వల్ల పూజకు ఆటంకం.. మహిళ ఆత్మహత్య

image

UPలోని ఝాన్సీలో ప్రియాంశ సోనీ(36) అనే మహిళ నవరాత్రి పూజకు ముందు పీరియడ్స్ రావడంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఛైత్ర నవరాత్రి పూజకు ముందు రోజు ఆమె కావాల్సిన సామగ్రి తెప్పించుకున్నారు. కానీ పీరియడ్స్ రావడంతో పూజ చేసుకోలేకపోయారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె విషం తాగి సూసైడ్‌కు పాల్పడ్డారు. పీరియడ్స్ అనేది ప్రతి నెలా సహజంగా జరిగేదేనని తాను నచ్చజెప్పినా సోనీ ఆత్మహత్య చేసుకుందని ఆమె భర్త తెలిపారు.

Similar News

News April 6, 2025

8న అల్లు అర్జున్ కొత్త సినిమా అప్డేట్?

image

పుష్ప-2 తర్వాత రెస్ట్ మోడ్‌లో ఉన్న అల్లు అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పనున్నారు. ఎల్లుండి కొత్త చిత్రాన్ని ప్రకటించనున్నట్లు సమాచారం. నిర్మాత బన్నీ వాస్ చేసిన ట్వీట్ ఇందుకు బలం చేకూరుస్తోంది. ‘APR 8న షాకింగ్ సర్‌ప్రైజ్‌కు సిద్ధంగా ఉండండి’ అని పేర్కొనడంతో ఐకాన్ స్టార్- అట్లీ మూవీ గురించేనని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఆ రోజు టెక్నీషియన్లను పరిచయం చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.

News April 6, 2025

జగన్‌ను మించి అప్పులు చేస్తున్న కూటమి: రామకృష్ణ

image

AP అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని CPI రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని జగన్ అప్పులపాలు చేశారని ఆరోపించిన కూటమి నేతలు ఇప్పుడు ఇంకా ఎక్కువ రుణాలు తెస్తున్నారని మండిపడ్డారు. అమరావతి కోసమే ₹62వేల కోట్లు తెచ్చారని, ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన 2 రోజులకే ₹5వేల కోట్లు అప్పు చేశారని విమర్శించారు. వక్ఫ్ బిల్లుకు మద్దతిచ్చి BJP, TDP, JSP, YCP ముస్లింలను మోసం చేశాయని ఫైరయ్యారు.

News April 6, 2025

హె‌చ్‌సీయూ రక్షణకు చేతులు కలపండి: కేటీఆర్

image

TG: HCU భూముల వివాదంపై ప్రజలు, విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులకు KTR బహిరంగ లేఖ రాశారు. కంచ గచ్చిబౌలి, HCU రక్షణకు చేతులు కలపాలని పిలుపునిచ్చారు. 400 ఎకరాల భూమి ప్రమాదంలో పడిందని, ఆర్థిక లాభం కోసం ప్రభుత్వం పర్యావరణంపై దాడి చేస్తోందని పేర్కొన్నారు. తప్పుడు సమాచారంతో ఉద్యమాన్ని తప్పుదారి పట్టిస్తోందని మండిపడ్డారు. ఆ భూముల్లో 734 రకాల మొక్కలు, 220 రకాల పక్షులు, 15 రకాల జంతువులు ఉన్నాయన్నారు.

error: Content is protected !!