News April 5, 2025
హత్నూర: ఇద్దరు గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం బోర్పట్ల భీముని చెరువులో గల్లంతైన ఇద్దరిలో ఒకరి మృతదేహం లభ్యమైనట్లు స్థానిక పోలీసులు తెలిపారు. మండలంలోని బోర్పట్ల గ్రామానికి చెందిన డప్పు నవీన్ కుమార్ మృతదేహం లభ్యమైందని చెప్పారు. కొండాపూర్ మండలం కొత్త గడి గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్ మృతదేహం కోసం మత్స్యకారులు, గజ ఈతగాళ్లు గాలిస్తున్నారని చెప్పారు.
Similar News
News April 11, 2025
KNR జిల్లాలో పెరుగుతున్న ఎండ తీవ్రత.. 11 మండలాల్లో 40°C పైగా నమోదు

కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా జమ్మికుంట, మానకొండూర్ మండలాల్లో 41.4°C నమోదు కాగా, ఇల్లందకుంట, గన్నేరువరం 41.2, తిమ్మాపూర్ 41.1, కరీంనగర్ రూరల్ 41.0, చిగురుమామిడి 40.9, కరీంనగర్ 40.4, గంగాధర, వీణవంక, కొత్తపల్లి 40.3, రామడుగు 39.9, శంకరపట్నం 39.8, సైదాపూర్ 39.7, హుజూరాబాద్ 39.5, చొప్పదండి 38.4°C గా నమోదైంది.
News April 11, 2025
అనారోగ్యంతో అప్పులపాలు.. ఆదుకుంటామని లోకేశ్ హామీ

AP: ఏలూరుకు చెందిన దుర్గాప్రసాద్ అనే చిరుద్యోగి ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. నరాలు, గుండెకు సంబంధించిన సమస్యలు రావడంతో రూ.7లక్షలకు పైగా ఆస్పత్రి ఖర్చులు అయ్యాయి. కుటుంబాన్ని పోషించడానికి అప్పులు చేయాల్సి వచ్చింది. అతడి పరిస్థితి తెలిసి, ప్రసాద్‌ను ఆదుకోవాలని టీడీపీ నేతలు మంత్రి లోకేశ్‌ను కోరడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. ప్రసాద్ కుటుంబ సభ్యులతో మాట్లాడాలని తన టీమ్‌ను మంత్రి ఆదేశించారు.
News April 11, 2025
GNT: వేసవిలో తిరుపతి-శిర్డీ యాత్రికుల కోసం ప్రత్యేక రైళ్లు

వేసవి సెలవుల్లో తిరుపతి, శిర్డీ యాత్రికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. మే 13 నుంచి జూన్ 28 వరకు ప్రతి ఆదివారం తిరుపతి నుంచి శిర్డీకి నంబర్ 07037 రైలు నడుస్తుంది. చీరాల, బాపట్ల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి మీదుగా శిర్డీకి చేరుతుంది. తిరుగు ప్రయాణంగా నంబర్ 07638 రైలు మే 14 నుంచి జూన్ 30 వరకు ప్రతి సోమవారం శిర్డీ నుంచి బయలుదేరి మంగళవారం తిరుపతికి చేరనుంది.