News April 5, 2025
RSS నెక్స్ట్ టార్గెట్ క్రిస్టియన్ల ఆస్తులే: రాహుల్

వక్ఫ్ సవరణ బిల్లు తర్వాత RSS దృష్టి క్రిస్టియన్ ఆస్తులపై పడిందని రాహుల్ గాంధీ అన్నారు. ముస్లింలే లక్ష్యంగా వక్ఫ్ సవరణ బిల్లును తీసుకొచ్చిన కేంద్రం తర్వాత ఇతర మతాలనూ టార్గెట్ చేస్తుందని తాను గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. దేశంలో 7కోట్ల హెక్టార్లలో క్యాథలిక్ చర్చిలు ఉన్నాయని RSS సంబంధిత పోర్టల్ ప్రచురించినట్లు తెలిపారు. రాజ్యాంగం మాత్రమే ఇలాంటి దాడుల నుంచి ప్రజలను కాపాడగలదని ట్వీట్ చేశారు.
Similar News
News September 13, 2025
భవనం గుండా ఫ్లైఓవర్.. ఎక్కడంటే?

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఉంటాఖానా అశోక్ చౌక్ వద్ద నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మిస్తోన్న ఫ్లైఓవర్ చర్చనీయాంశమవుతోంది. ఫ్లైఓవర్‌ను ఏకంగా నివాస భవనం గుండా తీసుకెళ్లడంతో ప్రజలు వింతగా చూస్తున్నారు. జవాబుదారీతనం లేకపోవడంతోనే ఇలా ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. గతంలోనూ ఓ రైల్వే ఓవర్ బ్రిడ్జిని 90 డిగ్రీల మలుపుతో నిర్మించిన విషయం తెలిసిందే.
News September 13, 2025
ట్యాబ్లెట్ వేసుకోగానే నొప్పి ఎలా తగ్గుతుందంటే?

శరీరంలో ప్రతి మందుకీ ప్రత్యేకమైన గ్రాహకాలు(రిసెప్టార్లు) ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ‘పేగులు, రక్తంలో కలిసి కాలేయం గుండా వెళ్లినప్పుడు మందు కొంత కరుగుతుంది. మిగిలినది గుండెకు చేరి అక్కడి నుంచి శరీరమంతా చేరుతుంది. ఒళ్లంతా వెళ్లినా పనిచేయాల్సిన గ్రాహకాలు కొన్ని భాగాల్లోనే ఉంటాయి. ఉదా.. పెయిన్ కిల్లర్ మందు మెదడులోని ఓపియాయిడ్ గ్రాహకాలను ఉత్తేజం చేసి నొప్పిని తగ్గేలా చేస్తుంది’ అని పేర్కొన్నారు.
News September 13, 2025
పసికూనపైనా పాక్ చెత్త ప్రదర్శన!

ఆసియా కప్ 2025లో ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు అంతంత మాత్రం ప్రదర్శన చేసి అబాసు పాలవుతోంది. నిర్ణీత 20 ఓవర్లలో పాక్ 7 వికెట్ల నష్టానికి 160 పరుగులే చేసింది. మహ్మద్ హ్యారిస్(66), ఫర్హాన్(29), ఫకర్ జమాన్(23) మినహా ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. కెప్టెన్ సల్మాన్ అఘా, ఓపెనర్ అయూబ్ గోల్డెన్ డక్ కావడం గమనార్హం. ఒమన్ బౌలర్లలో ఫైజల్, ఖలీమ్‌లకు చెరో 3 వికెట్లు, మహ్మద్ నదీమ్ ఒక వికెట్ తీశారు.