News April 5, 2025
మంగళగిరి: అఘోరీ ఉచ్చు నుంచి బయటపడిన శ్రీవర్షిణి

అఘోరీ చేతుల్లో నుంచి మంగళగిరి యువతి శ్రీవర్షిణిని పోలీసులు సురక్షితంగా కాపాడారు. నెల రోజుల క్రితం శ్రీవర్షిణి తల్లిదండ్రుల ఇంటికి వచ్చిన లేడీ అఘోరీ, మాయమాటలతో ఆమెను వశం చేసుకుని గుజరాత్‌కు తీసుకెళ్లింది. కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు మంగళగిరి పోలీసులను ఆశ్రయించారు. కేసు గుజరాత్ వరకు వెళ్లింది. అక్కడ అఘోరీని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. శ్రీవర్షిణిని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Similar News
News April 6, 2025
తెనాలి: పోలీసుల అదుపులో రౌడీ షీటర్ లడ్డు

తెనాలి ఐతానగర్ చెందిన రౌడీషీటర్ లడ్డు మరోసారి పోలీసులకు చిక్కాడు. పలు నేరాల్లో భాగంగా ఇటీవల పీడి యాక్ట్ నమోదై జైలుకు వెళ్లి వచ్చిన లడ్డు తాజాగా మరో కేసులో ఇరుక్కున్నాడు. కోపల్లెకి చెందిన మహిళపై దాడి చేసిన ఘటనలో బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి లడ్డును అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ లిఫ్ట్ చేయలేదన్న కారణంతో మహిళపై లడ్డు రాడ్డుతో దాడి చేసినట్లు అభియోగాలు ఉన్నాయి.
News April 6, 2025
తాడేపల్లి: 8వ అంతస్తు నుంచి పడి వ్యక్తి మృతి

తాడేపల్లిలో ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ అపార్ట్‌మెంట్ 8వ అంతస్తు నుంచి ఒక వ్యక్తి కింద పడి అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు సదా శివరావుగా గుర్తించారు. ఘనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News April 6, 2025
గుంటూరు: శోభా యాత్రకు పోలీస్ శాఖ ఏర్పాట్లు

గుంటూరు నగరంలో శ్రీరామ నవమి శోభాయాత్రను శాంతి యుతంగా నిర్వహించేందుకు పోలీసులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఎస్పీ సతీశ్ పలు ప్రధాన ప్రాంతాల్లో రూట్ మాప్‌ను స్వయంగా పరిశీలించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శోభా యాత్ర ముగియనున్న ఆర్ అగ్రహారం శ్రీ రామనామ క్షేత్రం వద్ద భద్రత కట్టుదిట్టంగా ఉండేలా సూచనలు ఇచ్చారు.