News April 5, 2025
కాంగ్రెస్, BRS, ఎంఐఎం ఒకటే: కిషన్ రెడ్డి

TG: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ మజ్లిస్ హస్తగతం కాకుండా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ‘కాంగ్రెస్, BRS, ఎంఐఎం ఒకటే అని మరోసారి నిరూపితమైంది. ఎమ్మెల్సీ పదవిని మజ్లిస్ పార్టీకి ఏకగ్రీవం చేసేందుకు కాంగ్రెస్, BRS తమ అభ్యర్థులను బరిలోకి దింపలేదు. ఎంఐఎంకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News April 6, 2025
మోదీ కౌంటర్..సంతకాలైనా తమిళంలో చేయండి

వైద్య విద్యను తమిళంలో అందించాలని తమిళనాడు ప్రభుత్వానికి ప్రధాని మోదీ సూచించారు. రాష్ట్రం నుంచి వచ్చిన వినతి పత్రాలలో సంతకాలు తమిళంలో ఉండవని, కనీసం సంతకాలైనా మాతృభాషలో చేస్తే బాగుంటుందని రాష్ట్ర నాయకులకు సూచించారు. తమిళ భాష, సంస్కృతి అభివృద్ధి కోసం కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. జాతీయ విద్యా విధానం అమలు చేస్తే తమిళ భాషకు అన్యాయం జరుగుతుందని స్టాలిన్ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.
News April 6, 2025
ప్రియురాలితో మహిళా క్రికెటర్ పెళ్లి

ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ యాష్లీ గార్డనర్ తన ప్రియురాలు మోనికా రైట్ను వివాహమాడారు. 2021 నుంచి డేటింగ్లో ఉన్న వీరు గత ఏడాది ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. తాజాగా అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లితో ఒక్కటయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన గార్డనర్.. ‘Mrs & Mrs Gardner’ అంటూ తమ వెడ్డింగ్ ఫొటోను పోస్ట్ చేశారు. ఆమె ఈ ఏడాది WPLలో గుజరాత్ జెయింట్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించారు.
News April 6, 2025
BRSతో డీల్.. అందుకే HYD స్థానిక ఎన్నికల్లో బీజేపీ పోటీ: పొన్నం

TG: HYD స్థానిక సంస్థల ఎన్నికల్లో BRSతో ఒప్పందంలో భాగంగానే BJP నామినేషన్ దాఖలు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ‘ఈ ఎన్నికల్లో 112 ఓట్లు ఉన్నాయి. ఇందులో BJPకి 27, BRSకు 23, MIMకు 49 ఉన్నాయి. మాకు 13 మాత్రమే ఉండటంతో పోటీ చేయలేదు. బలం లేని బీజేపీ ఎలా గెలుస్తుంది? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి BRSకు బినామీగా వ్యవహరిస్తున్నారనే చర్చ ప్రజల్లో ఉంది’ అని ట్వీట్ చేశారు.