News April 5, 2025
కంచ గచ్చిబౌలిలో 2000 ఎకరాల్లో ఎకో పార్క్.. నిజమేనా?

TG: కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల్లో అభివృద్ధి కోసం తలపెట్టిన ప్రాజెక్టును ప్రభుత్వం రద్దు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి బదులు అక్కడే HCU భూమితో సహా 2000 ఎకరాలను ఎకో పార్క్‌గా మార్చనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ వార్తలను HCU రిజిస్ట్రార్ దివేశ్ ఖండించారు. అలాంటి ప్లాన్ ఏదీ తమ దృష్టికి రాలేదన్నారు. వర్సిటీని తరలించేందుకు తాము ఒప్పుకోమని, పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని HCU SU VP ఆకాశ్ అన్నారు.
Similar News
News November 16, 2025
పశువులకు మేతగా ఉల్లిపాయలతో డేంజర్

ఉల్లికి సరైన ధర లేకపోతే కొందరు రైతులు ఆ పొలాలను గొర్రెలు, మేకలు, పశువులకు మేతగా వదిలేస్తున్నారు. కానీ ఇలా చేయడం ప్రమాదకరమని వెటర్నరీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉల్లిపాయల్లో ఉండే N-propyl disulfide అనే రసాయనం పశువుల్లోని ఎర్రరక్తకణాలను విడదీస్తుందని తెలిపారు. దీనివల్ల వాటిలో బలహీనత, కళ్లు, మూత్రం ఎర్రగా మారడం, శ్వాసలో వేగం పెరగడం, కడుపులో వాపు, లక్షణాలు తీవ్రమైతే అవి మరణించే అవకాశం ఉందంటున్నారు.
News November 16, 2025
పశువులకు ‘ఉల్లి’తో సమస్య.. చికిత్స ఇలా

ఒక రోజులో పశువు తినే మొత్తం మేతలో 5 నుంచి 10 శాతానికి మించి ఉల్లిపాయలు ఉండకూడదని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. అది కూడా వారంలో 2-3 రోజులు మాత్రమే ఇవ్వాలన్నారు. ‘ఈ పరిమితి మించితే పశువుల కళ్లు, మూత్రం ఎర్రగా మారిపోతాయి. ఆహారం తీసుకోవు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వెటర్నరీ వైద్యుల సూచనతో విటమిన్ ఇ, సెలీనియం, ఫాస్ఫరస్ ఇంజెక్షన్లు, లివర్ టానిక్‌లు, చార్కోల్ లిక్విడ్ లాంటివి అందించాలి.
News November 16, 2025
DIHARలో 21 పోస్టులు

DRDO అనుబంధ సంస్థ డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూడ్ రీసెర్చ్(DIHAR) 21 JRF,రీసెర్చ్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి ఎంటెక్, బీటెక్, BE, MSc, M.VSc, PhD ఉత్తీర్ణతతో పాటు NET/GATE అర్హత గలవారు డిసెంబర్ 5న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. వయసు 28 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. JRFకు నెలకు రూ.37వేలు+HRA, RAకు రూ.67వేలు+HRA చెల్లిస్తారు.


