News April 5, 2025

కాళ్ల: బాబూ జగ్జీవన్ రామ్‌కు నివాళులర్పించిన కలెక్టర్

image

కాళ్ల మండలం వేంపాడు గ్రామంలో భారతదేశ తొలి ఉపప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని శనివారం కలెక్టర్ సి.నాగరాణి నిర్వహించారు. గ్రామంలోని ఆయన విగ్రహానికి గ్రామ సర్పంచ్‌తో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, సమాజంలో అణగారిన ప్రజల కోసం కృషి చేసిన మహనీయుడని ఆయన్ని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Similar News

News April 6, 2025

7న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక: కలెక్టర్

image

భీమవరంలోని కలెక్టరేట్‌లో ఈ నెల 7న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని.. గమనించాలని కోరారు. డివిజన్, మండల స్థాయిలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులు విధిగా హాజరుకావాలన్నారు. కాగా పలు కారణాలతో  గత వారం పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దైన సంగతి తెలిసిందే.

News April 6, 2025

ఆకివీడులో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

ఆకివీడు జిల్లా పరిషత్ హైస్కూల్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఓ మృతి చెందాడు. ఆకివీడు పెదపేటకు చెందిన మేకల మైకేల్ రాజ్ (40) రహదారి దాటుతుండగా ఎదురుగా వచ్చిన బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు చెప్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఆకివీడు ఎస్ఐ హనుమంతు నాగరాజు తెలిపారు. కాగా మైకేల్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

News April 6, 2025

ప.గో: తాగునీరు సమస్య లేకుండా ప్రణాళిక: జేసీ

image

వేసవి దృష్ట్యా జిల్లాలో ప్రజలకు తాగునీరు అందించడంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా పటిష్టమైన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని జేసీ రాహుల్ అన్నారు. శనివారం భీమవరం కలెక్టరేట్‌లో జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో మాట్లాడారు. జన సమూహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు మంచినీరు, మజ్జిగ అందించాలన్నారు.

error: Content is protected !!