News April 5, 2025
లొంగిపోయిన 86 మంది మావోయిస్టులు

TG: కేంద్రం చేపట్టిన ప్రత్యేక కూంబింగ్ ఆపరేషన్ నేపథ్యంలో మరోసారి భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. భద్రాద్రి కొత్తగూడెంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో 86 మంది ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. వీరిలో 20 మంది మహిళలు, 66 మంది పురుషులు ఉన్నారు. లొంగి పోయిన మావోయిస్టులకు ఐజీ నజరానాను అందజేశారు. కాగా దేశంలో ఈ ఏడాది చేపట్టిన కూంబింగ్ ఆపరేషన్‌లో 300 మందికిపైగా మావోయిస్టులు మరణించారు.
Similar News
News April 6, 2025
ఎల్లుండి ఓదెల-2 ట్రైలర్

తమన్నా ప్రధాన పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ ‘ఓదెల-2’ ట్రైలర్‌ను ఈ నెల 8న మ.3 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ముంబైలోని ఐకానిక్ ఐమాక్స్ థియేటర్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి అశోక్ తేజ దర్శకత్వం వహించగా, సంపత్ నంది నిర్మాతగా వ్యవహరించారు. ఈ నెల 17న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
News April 6, 2025
సన్న బియ్యం దేశం మొత్తం ఎందుకు ఇవ్వడం లేదు?: మహేశ్ గౌడ్

తెలంగాణ ప్రజలకు ఇస్తున్న సన్నబియ్యం కేంద్ర ప్రభుత్వానివేనని BJP నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ‘BJP దేశం మొత్తం ఎందుకు ఇవ్వడం లేదు? కేంద్రమంత్రి బండి సంజయ్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవి, సొంత పార్టీలో గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. రాజకీయాల కోసం కొందరు HCUపై మాట్లాడటం సరికాదు. మేం చేసిన అభివృద్ధి కనిపించడం లేదా’ అని ప్రశ్నించారు.
News April 6, 2025
కరాటే కళ్యాణికి హేమ లీగల్ నోటీసులు

తన పరువుకు భంగం కలిగించేలా కామెంట్స్ చేశారంటూ కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు పంపారు. అవాస్తవాలు ప్రచారం చేయడంతోపాటు అసభ్యంగా మాట్లాడారని తెలిపారు. బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారంటూ హేమపై కేసు నమోదవడంతో MAA ఆమెను సస్పెండ్ చేసింది. తర్వాత టెస్టుల్లో నెగటివ్ రిపోర్టు రావడంతో సస్పెన్షన్‌ను ఎత్తేసింది. ఇదే విషయంపై కళ్యాణి, హేమకు గతంలో చాలాసార్లు <<13300086>>వాగ్వాదాలు<<>> జరిగిన విషయం తెలిసిందే.