News April 5, 2025

జగిత్యాల: బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే

image

JGTL జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో స్వాతంత్ర్య సమరయోధుడు, బాబు జగ్జీవన్ రామ్ జయంతిని కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ నివాళులు అర్పించారు. జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. జగ్జీవన్ రామ్ వ్యవసాయ, రక్షణ రంగాల్లో కీలక సేవలు అందించారని, కార్మిక హక్కుల కోసం పోరాడారని అన్నారు. ఏడాదిలోగా జగిత్యాలలో విగ్రహం ఏర్పాటు చేస్తామని అడ్లూరి తెలిపారు.

Similar News

News April 6, 2025

APలో ఎండ తీవ్రత పెరిగే అవకాశం

image

AP వ్యాప్తంగా క్రమంగా ఎండతీవ్రత పెరగనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. కొన్నిచోట్ల అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోమవారం(07-04-25) రాయలసీమలో 40-42°C, ఉత్తరాంధ్రలో 39-41°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్సుందన్నారు. ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలన్నారు.

News April 6, 2025

దేవీపట్నం: ‘మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని భార్యనే హత్య చేశాడు’

image

దేవీపట్నం(M) పాముగండికి చెందిన కె.గంగన్నదొర మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని అతని భార్య పాపయమ్మ (28) హత్య చేసాడని ఎస్సై షరీఫ్ ఆదివారం తెలిపారు. తాగుడుకు అలవాటు పడిన గంగన్న దొర నిత్యం డబ్బులు కోసం ఆమెను వేధించేవాడని పేర్కొన్నారు. అడిగిన వెంటనే డబ్బులు ఇవ్వలేదని ఆమెను కర్రతో తీవ్రంగా కొట్టి, గొంతు నొక్కి చంపాడని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News April 6, 2025

ASF: బాల రాముడు సూపర్

image

ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండల కేంద్రంలో శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఓ చిన్నారి శ్రీరాముని వేషాధారణలో పలువురిని ఆకట్టుకుంది. మండలం దర్గపల్లి గ్రామానికి చెందిన జెట్టి శ్రీకాంత్-రమాదేవి దంపతుల కుమార్తె జెట్టి గనిష్క రాముడి వేషధారణలో అందరిని అలరించింది. చిన్ననాటి నుంచి దేవుడి వేషాధరణలో ఆధ్యాత్మిక చింతన పెంపొందించడం శుభప్రదమని పలువురు అభిప్రాయపడ్డారు.

error: Content is protected !!