News April 5, 2025
జగిత్యాల: అంబేడ్కర్ జయంతి ఉత్సవాల వాల్ పోస్టర్ ఆవిష్కరణ

జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈనెల 14 నిర్వహించే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి ఉత్సవాల వాల్ పోస్టర్‌ను SC, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ వెంకటయ్య శనివారం ఆవిష్కరించారు. జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ బి ఎస్ లత, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఉత్సవాల కమిటీ జిల్లా ఛైర్మన్ భాస్కర్ ఉన్నారు.
Similar News
News April 6, 2025
APలో ఎండ తీవ్రత పెరిగే అవకాశం

AP వ్యాప్తంగా క్రమంగా ఎండతీవ్రత పెరగనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. కొన్నిచోట్ల అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోమవారం(07-04-25) రాయలసీమలో 40-42°C, ఉత్తరాంధ్రలో 39-41°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్సుందన్నారు. ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలన్నారు.
News April 6, 2025
దేవీపట్నం: ‘మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని భార్యనే హత్య చేశాడు’

దేవీపట్నం(M) పాముగండికి చెందిన కె.గంగన్నదొర మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని అతని భార్య పాపయమ్మ (28) హత్య చేసాడని ఎస్సై షరీఫ్ ఆదివారం తెలిపారు. తాగుడుకు అలవాటు పడిన గంగన్న దొర నిత్యం డబ్బులు కోసం ఆమెను వేధించేవాడని పేర్కొన్నారు. అడిగిన వెంటనే డబ్బులు ఇవ్వలేదని ఆమెను కర్రతో తీవ్రంగా కొట్టి, గొంతు నొక్కి చంపాడని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
News April 6, 2025
ASF: బాల రాముడు సూపర్

ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండల కేంద్రంలో శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఓ చిన్నారి శ్రీరాముని వేషాధారణలో పలువురిని ఆకట్టుకుంది. మండలం దర్గపల్లి గ్రామానికి చెందిన జెట్టి శ్రీకాంత్-రమాదేవి దంపతుల కుమార్తె జెట్టి గనిష్క రాముడి వేషధారణలో అందరిని అలరించింది. చిన్ననాటి నుంచి దేవుడి వేషాధరణలో ఆధ్యాత్మిక చింతన పెంపొందించడం శుభప్రదమని పలువురు అభిప్రాయపడ్డారు.