News April 5, 2025
విజయవాడ: రద్దైన Dy.CM పవన్ భద్రాచలం పర్యటన

డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపటి భద్రాచలం పర్యటన రద్దయినట్లు విజయవాడలోని ఆయన కార్యాలయ వర్గాలు శనివారం ఓ ప్రకటన విడుదల చేశాయి. ఏపీ ప్రభుత్వం తరఫున భద్రాద్రి రామయ్యకు శ్రీరామ నవమి సందర్భంగా పవన్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు తొలుత సమాచారం వెలువడింది. తాజాగా పర్యటన రద్దైనట్లు పవన్ కార్యాలయం తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ అధికారులకు సమాచారం అందచేసింది.
Similar News
News April 7, 2025
ఆ నలుగురితో మళ్లీ ఆడాలనుకుంటున్నా: ధోనీ

మళ్లీ అవకాశం వస్తే సెహ్వాగ్, సచిన్, గంగూలీ, యువరాజ్‌లతో కలిసి ఆడాలనుకుంటున్నట్లు ధోని చెప్పారు. క్లిష్ట పరిస్థితుల్లో వాళ్లు ఆడుతున్నప్పుడు చాలా అందంగా ఉంటుందని ఓ పాడ్‌కాస్ట్‌లో తెలిపారు. 2007 T20WCలో ఇంగ్లండ్‌పై ఒకే ఓవర్లో యువరాజ్ ఆరు సిక్సర్లపై ప్రశంసలు కురిపించారు. ప్రతి ఒక్కరూ మ్యాచ్ విన్నర్లేనని, ఇండియన్ క్రికెట్ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.
News April 7, 2025
ప్రధాని వ్యాఖ్యలకు చిదంబరం కౌంటర్

తమిళనాడుకు UPA ప్రభుత్వం కంటే అధిక నిధులిచ్చామన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం స్పందించారు. ఎకానమీ, మ్యాట్రిక్స్ గతంతో పోల్చితే ఎప్పుడూ అధికంగానే ఉంటాయని, ఈ విషయం ఫస్టియర్ ఎకానమీ, స్టూడెంట్ను అడిగినా చెబుతారన్నారు. ప్రతి ఏడాది జీడీపీ పెరిగినట్లే బడ్జెట్ పెరుగుతుందన్నారు. మీ వయసు గత సంవత్సరంతో పోలిస్తే ఒక ఏడాది పెరుగుతుంది కదా అని మోదీని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.
News April 7, 2025
స్వగ్రామంలో వెంకయ్య నాయుడు పూజలు

మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు స్వగ్రామమైన వెంకటాచలం మండలం చౌటపాలెంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన తన మనువడు విష్ణుబాబుతో కలిసి సీతారాముల కళ్యాణంలో పాల్గొన్నారు. సమాజంలో కనిపిస్తున్న వివక్షలు, అసహనం వంటి సామాజిక రుగ్మతలకు శ్రీరాముడి ఆదర్శాలే సరైన పరిష్కారమని వెంకయ్య నాయుడు సూచించారు.