News April 5, 2025

మార్కాపురం: రైల్వే పట్టాలపై మృతదేహం కలకలం

image

మార్కాపురం రైల్వే స్టేషన్ ఔటర్ వద్ద పట్టాల పక్కన శనివారం మధ్యాహ్నం వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. గమనించిన స్థానికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడా లేదా రైల్లో నుంచి జారిపడ్డాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చనిపోయిన వ్యక్తి  వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Similar News

News April 6, 2025

ఒంగోలు: పూర్తయిన ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్

image

ఒంగోలు నగరంలోని ఏకేవీకే జూనియర్ కళాశాలలో గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఇంటర్ స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ ముగిసింది. మార్కుల మొత్తం జాబితాను తయారు చేసి కంప్యూటరీకరణ కూడా పూర్తయినట్లుగా అధికారులు తెలిపారు. కాగా ఎక్కడైనా లోపాలు ఉన్నాయా అనేవి చూసి తప్పులు ఉంటే వాటిని సరిచేస్తున్నామని తెలిపారు. కాగా ఇంటర్ పరీక్ష ఫలితాలు ఈ నెల 12వ తేదీన విడుదలవుతాయని అధికారులు ఇప్పటికే తెలిపారు.

News April 6, 2025

కొండపి: బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన వృద్ధుడు

image

ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికతో 52 సంవత్సరాల వృద్ధుడు అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటంతో బాలిక తల్లిదండ్రులు కొండేపి పోలీసులను ఆశ్రయించారు. కొండపి మండలం ఉప్పలపాడులో పనుల కోసం వచ్చిన తల్లిదండ్రులు బాలికను ఇంటి వద్ద వదిలి పనులకు వెళ్తున్న సమయంలో అక్కడే ఉంటున్న సాదు వెంకట కోటయ్య బాలికతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ప్రైవేటు భాగాలను తాకుతూ ఉండటంతో పోలీసులు అతనిపై ఫోక్సో కేసు నమోదు చేశారు.

News April 6, 2025

ఒంగోలు: మసాజ్ సెంటర్‌పై దాడులు

image

మసాజ్ సెంటర్లు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నాయని ఒంగోలు వాసులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు పోలీసు అధికారులు దాడులు నిర్వహించినప్పటికీ నిర్వాహకుల తీరులో మార్పు రావటం లేదని పేర్కొన్నారు. ఒంగోలులోని ఓ మసాజ్ సెంటర్ నిర్వాహకుడిపై ఒంగోలు తాలూకా సీఐ శ్రీనివాస్ రావు, సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఇద్దరు పురుషులు, ఇద్దరు స్త్రీలను అదుపులోకి తీసుకున్నారు.

error: Content is protected !!