News April 5, 2025
అశ్లీల వీడియోలు చూసి షేర్ చేస్తున్నారా?

అశ్లీల వీడియోలను చూడటం, షేర్ చేయడం నేరమని TG పోలీసులు హెచ్చరించారు. యువత పోర్నోగ్రఫీకి దూరంగా ఉండాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ చూడొద్దని సూచించారు. సోషల్ మీడియాను మంచికోసం వాడుకోవాలని, అశ్లీల వీడియోలను పోస్ట్ & షేర్ చేసేవారిపై నిఘా ఉంచినట్లు పేర్కొన్నారు. తాజాగా సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ యువకుడు బాలల అశ్లీల సన్నివేశాలను పంపినందుకు అరెస్ట్ అయినట్లు తెలిపారు.
Similar News
News April 7, 2025
50కి పైగా దేశాలు మాతో బేరాలాడుతున్నాయి: US

ట్రంప్ విధించిన సుంకాలతో ప్రభావితమైన వాటిలో 50కి పైగా దేశాలు తమతో టారిఫ్‌ల తగ్గింపుపై బేరాలాడుతున్నాయని అమెరికా జాతీయ ఆర్థిక మండలి డైరెక్టర్ కెవిన్ హాసెట్ వెల్లడించారు. ‘దేశ ప్రయోజనాలే ట్రంప్‌కు ముఖ్యం. వేరే ఉద్దేశాలేం లేవు. అనేక దేశాలు ఇప్పుడు మాతో చర్చలు జరుపుతున్నాయి. సుంకాల వల్ల పెద్ద ఇబ్బంది అవుతుందని మేం భావించట్లేదు. మనకు ఎగుమతి చేసే దేశాలు తమ సుంకాల్ని తగ్గిస్తాయంతే’ అని వివరించారు.
News April 7, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News April 7, 2025
ఏప్రిల్ 7: చరిత్రలో ఈరోజు

1920: సంగీత విద్వాంసుడు రవిశంకర్ జననం
1942: బాలీవుడ్ నటుడు జితేంద్ర జననం
1962: సినీదర్శకుడు రామ్‌గోపాల్ వర్మ జననం
1962: నటి కోవై సరళ జననం
1991: కవి కొండవీటి వెంకటకవి మరణం
* ప్రపంచ ఆరోగ్య దినోత్సవం