News April 5, 2025
ఉమ్మడి జిల్లాల నేతలతో KCR సమావేశం

TG: ఇటీవల పలు జిల్లాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్న BRS చీఫ్ కేసీఆర్ తాజాగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల నేతలతో భేటీ అయ్యారు. ఎర్రవెల్లి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ, రజతోత్సవ మహాసభ నిర్వహణలపై వారితో చర్చిస్తున్నారు. సభ నిర్వహణ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, ప్రజలను తరలించడం సహా పలు అంశాలపై నేతలతో మాజీ సీఎం సమాలోచనలు చేస్తున్నారు.
Similar News
News September 13, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News September 13, 2025
శుభ సమయం (13-09-2025) శనివారం

✒ తిథి: బహుళ షష్ఠి ఉ.11.17 వరకు
✒ నక్షత్రం: కృత్తిక మ.2.55 వరకు
✒ శుభ సమయములు: లేవు
✒ రాహుకాలం: ఉ.9.00-ఉ.10.30
✒ యమగండం: మ.1.30-మ.3.00
✒ దుర్ముహూర్తం: ఉ.6.00-ఉ.7.36
✒ వర్జ్యం: తె.5.47లగాయతు
✒ అమృత ఘడియలు: మ.12.40-మ.2.09
News September 13, 2025
టాలీవుడ్ సంచలనం.. తేజా సజ్జ

కలిసుందాం రా, ఇంద్ర, ఠాగూర్, గంగోత్రి తదితర సినిమాల్లో బాలనటుడిగా ప్రేక్షకులకు సుపరిచితమైన తేజా సజ్జ వరుస హిట్లతో అదరగొడుతున్నారు. జాంబిరెడ్డి, హనుమాన్, తాజాగా ‘మిరాయ్’ మూవీతో సూపర్ హిట్లు అందుకున్నారు. ముఖ్యంగా దైవభక్తికి సంబంధించిన హనుమాన్, మిరాయ్ అతడికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. ప్రస్తుతం ‘జై హనుమాన్’ చిత్రంలో నటిస్తున్నారు. తేజకు మంచి భవిష్యత్తు ఉందని నెటిజన్లు అభినందిస్తున్నారు.