News April 5, 2025
MDCL: ఇంటి వద్దనే టీకా..ఎందుకలా..?

గ్రేటర్ హైదరాబాద్‌లో అనేక మంది 15 ఏళ్లలోపు పిల్లలకు అందించాల్సిన టీకాలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కొన్ని టీకాలు తీసుకుని కొన్ని నెలల తర్వాత మానేస్తున్నారని వైద్య బృందం గుర్తించింది. దీంతో పిల్లలు వివిధ వ్యాధుల బారిన పడుతున్నారని గమనించి, ఇక లాభం లేదని గుర్తించి, పిల్లల ఇంటికే వెళ్లి టీకాలు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు డాక్టర్లు తెలిపారు.
Similar News
News April 6, 2025
కంచ భూములు కాపాడాలని విద్యార్థుల విజ్ఞప్తి

TG: గచ్చిబౌలి కంచ భూములను కాపాడాలని రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌ను గచ్చిబౌలిలో కలిసి విద్యార్థి జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు. భూముల కోసం తాము నిరసనలు చేపట్టిన సందర్భంగా నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని కోరారు. భూములను పరిశీలించేందుకు పోలీసులు అనుమతి ఇచ్చేలా చొరవ చూపాలని మీనాక్షికి వినతిపత్రం ఇచ్చారు. దీనిపై మాట్లాడి చెప్తానని విద్యార్థి నేతలకు ఆమె హామీ ఇచ్చారు.
News April 6, 2025
అగ్నివీర్‌లకు ప్రత్యేక రిజర్వేషన్లు

అగ్నివీర్‌లకు పోలీసు ఉద్యోగాల్లో 20శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు హరియాణా ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం ప్రత్యేకంగా ఒక పోర్టల్ తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ తెలిపారు. వీటితో పాటు స్వయం ఉపాధిని ఎంచుకునే వారికి ప్రత్యేక సబ్సిడీలు అందిస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయంతో అగ్నివీర్‌లకు రాష్ట్ర నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించిన తొలి రాష్ట్రంగా హరియాణా నిలిచింది.
News April 6, 2025
సూర్య తిలకం.. PHOTO OF THE DAY

యూపీ అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగగా సాగాయి. ఆలయ గర్భగుడిలో బాల రాముడి విగ్రహం నుదుటిపై ‘సూర్య తిలకం’ వీక్షించి భక్తులు పరవశించిపోయారు. ఈ అద్భుత దృశ్యం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది PHOTO OF THE DAY అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రతి శ్రీరామ నవమి రోజున రాముడి నుదుటిపై సూర్య కిరణాలు పడేలా బెంగళూరు IIA, CBRI సైంటిస్టులు ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.