News April 5, 2025
సిర్పూర్ (టి): పెనుగంగలో వ్యక్తి మృతదేహం

సిర్పూర్ (టి) మండలం టోంకిని గ్రామ సమీపంలోని పెన్ గంగలో శనివారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనట్లు ఎస్ఐ కమలాకర్ తెలిపారు. మృతుడి వయసు సుమారు 60 ఉంటుందని, సమాచారం తెలిసినవారు స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.
Similar News
News November 14, 2025
కామారెడ్డి జిల్లాలో చలి ప్రభావం తీవ్రం

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతలను అధికారులు వెల్లడించారు. కనిష్టంగా ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.. బొమ్మన్ దేవిపల్లి,గాంధారి,బీబీపేట లో 9.4°C, నస్రుల్లాబాద్ 9.5, జుక్కల్ 9.7, మేనూర్,రామలక్ష్మణపల్లి, లచ్చపేట లో 9.8, డోంగ్లి,సర్వాపూర్ లో 9.9, ఎల్పుగొండ, బీర్కూర్ లో10.1, నాగిరెడ్డిపేట 10.5, పుల్కల్ 10.7, లింగంపేట,బిచ్కుంద,రామారెడ్డి లో 10.8, భిక్కనూర్ 11°C లుగా నమోదయ్యాయి.
News November 14, 2025
వరల్డ్ క్లాస్ లెవెల్‌లో.. రూ.600 కోట్లతో విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి.!

విజయవాడ రైల్వే స్టేషన్‌ను PPP మోడల్ కింద రూ.600 కోట్లకు పైగా నిధులతో వరల్డ్ క్లాస్ వసతులతో అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే టెండర్లు పిలవగా, DEC 15తో గడువు ముగియనుంది. 24/7 వైఫై, AC హాల్స్, ప్రతి ప్లాట్‌ఫామ్‌పై ఎస్కలేటర్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు వంటి అనేక హంగులతో స్టేషన్‌ను తీర్చిదిద్దనున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ మోడల్ కింద ఎంపికైన ఏకైక స్టేషన్ విజయవాడ అని అధికారులు తెలిపారు.
News November 14, 2025
జూబ్లీ ఫలితాన్ని గమనిస్తున్న సిద్దిపేట ప్రజలు

జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాన్ని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. అధికార కాంగ్రెస్ గెలుస్తుందా? ప్రతిపక్ష బీఆర్ఎస్ గెలుస్తుందా? అని ప్రజలలో ఉత్కంఠ రేపుతుంది. ఈ ఎన్నికల ఫలితాలు స్థానిక ఎన్నికలపై ప్రభావం చూపుతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతుండగా.. గ్రామాల్లో నలుగురు కలిస్తే జూబ్లీ ఫలితంపైనే చర్చిస్తున్నారు. కాంగ్రెస్ విజయం సాధిస్తే ఇదే ఊపుతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశముందని టాక్.


