News April 5, 2025
8న అనంత జిల్లాలో జగన్ పర్యటన

AP: వైఎస్ జగన్ అనంతపురం పర్యటన ఖరారైంది. ఫ్యాక్షన్ రాజకీయాలకు బలైన వైసీపీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు రానున్నారు. రాప్తాడు నియోజకవర్గం రామగిరి(మ) పాపిరెడ్డిపల్లిలో ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు మాజీ సీఎం.
Similar News
News July 6, 2025
ప్రేమజంట ఆత్మహత్య!

AP: ప్రకాశం (D) కొమరోలు(M) అక్కపల్లెలో విషాదం నెలకొంది. పెద్దలు తమ వివాహానికి నిరాకరించడంతో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఇవాళ తెల్లవారుజామున యువతి, యువకుడు మృతదేహాలుగా చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. మృతులు నంద్యాల(D) ప్యాపిలి(M) మాధవరం వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
News July 6, 2025
జులై 13 నుంచి వెబ్ ఆప్షన్లు

AP: EAPCET, ఫార్మసీ కాలేజీల వెబ్ ఆప్షన్ల నమోదును ఈ నెల 13 నుంచి నిర్వహించనున్నారు. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 10 నుంచి జరగాల్సి ఉండగా, 13వ తేదీకి మార్చారు. ఇంజినీరింగ్ కాలేజీలకు యూనివర్సిటీల అనుబంధ గుర్తింపు, ప్రభుత్వ అనుమతులు రావడానికి ఆలస్యం కారణంగానే వెబ్ ఆప్షన్ల నమోదు షెడ్యూల్‌లో అధికారులు మార్పులు చేశారు.
News July 6, 2025
NFDBని అమరావతికి తరలించండి: చంద్రబాబు

AP: HYDలో ఉన్న జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు(NFDB)ను అమరావతికి తరలించాలని CM చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. ‘గతంలో దేశ మత్స్య రంగంలో AP పాత్ర గుర్తించి ఈ బోర్డును HYDలో ఏర్పాటు చేశారు. రాష్ట్రం విడిపోయినా ఆక్వా ఉత్పత్తుల్లో APదే కీలక వాటా. రూ.19,420 కోట్ల ఎగుమతులతో దేశానికి నాయకత్వం వహిస్తోంది. సుదీర్ఘ తీరం, రొయ్యల పరిశ్రమ ఉన్న APలో దీని ఏర్పాటుకు అనుకూల పరిస్థితులున్నాయి’ అని వివరించారు.