News April 5, 2025
మరో యువతిపై కత్తితో దాడి.. పరిస్థితి విషమం

AP: విశాఖలో <<15969970>>ప్రేమోన్మాది దాడి<<>> ఘటన మరువకముందే విజయనగరం(D) శివరాంలో అఖిల అనే యువతిపై దుండగుడు కత్తితో దాడి చేశాడు. మంకీ క్యాప్ ధరించి ఇంట్లోకి ప్రవేశించిన అతను అఖిల కడుపులో పొడిచాడు. ఆమె కేకలు వేయడంతో పారిపోయాడు. అపస్మారకస్థితిలోకి వెళ్లిన బాధితురాలిని స్థానికులు విజయనగరంలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఓ అనుమానితుడిని అరెస్ట్ చేశారు. ప్రేమ వ్యవహారమా? మరేదైనా కారణమా? అని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News January 27, 2026
మెదక్ జిల్లాలో 51 మాంసాహార జంతువులు..!

మెదక్ జిల్లాలో వన్య ప్రాణుల లెక్క తేలింది. జిల్లాలోని 6 రేంజ్‌ల పరిధిలో 51 మాంసాహార జంతువులు గుర్తించినట్లు డీఎఫ్ఓ జోజి పేర్కొన్నారు. రేంజ్‌ల వారీగా మాంసాహార జంతువులు మెదక్-16, రామాయంపేట-9, తుప్రాన్-5, నర్సాపూర్-6, కౌడిపల్లి-12, పెద్దశంకరంపేట-3 ఉన్నట్లు తెలిపారు. సర్వేలో 71 మంది అటవీ సిబ్బంది, 143 మంది వాలంటీర్లు పాల్గొన్నారని చెప్పారు.
News January 27, 2026
రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్

ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ కేన్ రిచర్డ్‌సన్(34 ఏళ్లు) క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. కేన్ 25 వన్డేలు, 36 T20Iలు ఆడారు. 2021 T20 వరల్డ్‌కప్ గెలిచిన ఆసీస్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్నారు. బిగ్ బాష్ లీగ్‌లో అన్ని సీజన్లలో ఆడిన కొద్దిమందిలో రిచర్డ్‌సన్ ఒకరు. BBLలో 142 వికెట్లు తీశారు. ఐపీఎల్ సహా పలు లీగ్‌ల్లోనూ ఆడి తనదైన ముద్ర వేశారు. IPLలో RCB, RR, PWI తరఫున ఆడారు.
News January 27, 2026
మునగలో కాయతొలుచు ఈగ నివారణకు సూచనలు

మునగ పంటలో విత్తనాలు నాటిన 5 నెలలకు పూత దశ ప్రారంభమవుతుంది. ఈ సమయంలో పంటకు కాయ తొలుచు ఈగ ముప్పు ఎక్కువ. ఇది పంటను ఆశించి పిందె దశలో కాయలోకి ప్రవేశించి లోపలి పదార్థాన్ని తిని నాశనం చేస్తుంది. దీని వల్ల కాయల ఆకారం మారిపోయి వంకరగా అవుతాయి. కాయతొలుచు ఈగ నివారణకు పూత దశలో లీటరు నీటికి ఫానలోన్ 2ml కలిపి పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.


