News April 5, 2025
పిల్లల్ని కనడం బాగానే ఉన్నా.. పెంచడమెలా?

ముగ్గురు వద్దు, ఒక్కరే ముద్దు! ఒకప్పటి నినాదం ఇది. కానీ ఇప్పుడు ముగ్గురు ముద్దు, కనీసం ఇద్దరినైనా కనండంటూ CMలే సెలవిస్తున్నారు. మానవ వనరులు తగ్గి అభివృద్ధిలో వెనుకబడుతున్నామంటున్నారు. అయితే పిల్లల్ని కనడం బాగానే ఉన్నా పెంచడమెలా అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. తినే తిండి నుంచి విద్య, వైద్యం వరకు అన్నింటి ధరలు పెరిగి పెను భారమైన వేళ ఒకరికి మించి కని, పెంచే స్తోమత లేదని వాపోతున్నారు. మీరేమంటారు?
Similar News
News April 7, 2025
ఆ నలుగురితో మళ్లీ ఆడాలనుకుంటున్నా: ధోనీ

మళ్లీ అవకాశం వస్తే సెహ్వాగ్, సచిన్, గంగూలీ, యువరాజ్‌లతో కలిసి ఆడాలనుకుంటున్నట్లు ధోని చెప్పారు. క్లిష్ట పరిస్థితుల్లో వాళ్లు ఆడుతున్నప్పుడు చాలా అందంగా ఉంటుందని ఓ పాడ్‌కాస్ట్‌లో తెలిపారు. 2007 T20WCలో ఇంగ్లండ్‌పై ఒకే ఓవర్లో యువరాజ్ ఆరు సిక్సర్లపై ప్రశంసలు కురిపించారు. ప్రతి ఒక్కరూ మ్యాచ్ విన్నర్లేనని, ఇండియన్ క్రికెట్ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.
News April 7, 2025
ప్రధాని వ్యాఖ్యలకు చిదంబరం కౌంటర్

తమిళనాడుకు UPA ప్రభుత్వం కంటే అధిక నిధులిచ్చామన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం స్పందించారు. ఎకానమీ, మ్యాట్రిక్స్ గతంతో పోల్చితే ఎప్పుడూ అధికంగానే ఉంటాయని, ఈ విషయం ఫస్టియర్ ఎకానమీ, స్టూడెంట్‌ను అడిగినా చెబుతారన్నారు. ప్రతి ఏడాది జీడీపీ పెరిగినట్లే బడ్జెట్ పెరుగుతుందన్నారు. మీ వయసు గత సంవత్సరంతో పోలిస్తే ఒక ఏడాది పెరుగుతుంది కదా అని మోదీని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.
News April 7, 2025
BREAKING: గుజరాత్ ఘన విజయం

IPL2025: సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన SRH 152/8 స్కోర్ చేయగా, GT 16.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సుదర్శన్ 5, గిల్ 61*, బట్లర్ 0, సుందర్ 49, రూథర్‌ఫర్డ్ 35* పరుగులు చేశారు. షమీ 2, కమిన్స్ ఒక వికెట్ తీశారు. అన్ని విభాగాల్లోనూ ఆరెంజ్ ఆర్మీ విఫలమైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతోంది.