News April 5, 2025
లక్ష్మణ్‌చందా: సరస్వతి కెనాల్‌లో మృతదేహం

లక్ష్మణ్‌చందా మండలంలోని వడ్యాల్ గ్రామ సమీపంలోని సరస్వతి కెనాల్‌లో శనివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్ఐ జుబేర్ తెలిపారు. గ్రామస్థుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలియలేదని, ఎవరికైనా వివరాలు తెలిస్తే స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్ఐ సూచించారు.
Similar News
News July 6, 2025
వరల్డ్‌లో HYD బిర్యానీ ది BEST!

HYD బిర్యానీ.. ఈ పేరు ఒక ఎమోషన్. దీని రుచి వరల్డ్ ఫేమస్. సిటీలో దమ్ బిర్యానీ తింటే ఫిదా అవ్వాల్సిందే. మాంసానికి మసాలా అంటించి, పెరుగు, నెయ్యి, నిమ్మకాయ రసం బాగా పట్టిస్తారు. బాస్మతి రైస్‌తో మాంసాన్ని ఉడికించి బిర్యానీ రెడీ చేస్తారు. ఫైనల్‌గా కొత్తిమీర, వేయించిన ఉల్లిపాయలు ఈ వంటకానికి మరింత రుచినిస్తాయి. ఇన్ని మిశ్రమాలతో చేసే HYD బిర్యానీ వరల్డ్ బెస్ట్‌గా నిలవడం విశేషం.
నేడు World Biryani Day
News July 6, 2025
సంగారెడ్డి జిల్లాలో ఎంపీడీఓల బదిలీలు

సంగారెడ్డి జిల్లా ఎంపీడీఓ సుధాకర్, మాల్సుర్ ఇతర జిల్లాలకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఇతర జిల్లాలో పని చేస్తున్న చంద్రశేఖర్, మంజుల, శారద దేవీ జిల్లాకు రానున్నట్లు పేర్కొన్నారు. బదిలీ అయిన ఎంపీడీఓలు తక్షణమే విధుల్లో చేరాలని సూచించారు.
News July 6, 2025
ప్రేమజంట ఆత్మహత్య!

AP: ప్రకాశం (D) కొమరోలు(M) అక్కపల్లెలో విషాదం నెలకొంది. పెద్దలు తమ వివాహానికి నిరాకరించడంతో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఇవాళ తెల్లవారుజామున యువతి, యువకుడు మృతదేహాలుగా చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. మృతులు నంద్యాల(D) ప్యాపిలి(M) మాధవరం వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.