News April 5, 2025
శ్రీరామనవమి వేడకలు.. తిరుపతి SP కీలక ఆదేశాలు

తిరుపతి జిల్లా ప్రజలు భక్తిశ్రద్ధలతో శ్రీరామనవమి వేడుకలను ప్రశాంత వాతావరణంలో చేసుకోవాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. శ్రీరాముడు ధర్మానికి, న్యాయానికి ప్రతీక అని అని.. ఈ పండుగ మనకు ధర్మాన్ని ఆచరించాలని సూచిస్తుందన్నారు. ధర్మాన్ని కాపాడాలంటూ శ్రీరామచంద్రుడు చూపిన మార్గం వైపు ప్రజలు నడవాలన్నారు. శ్రీరామనవమి వేడుకల్లో ఎక్కడ డీజేలు పెట్టవద్దని ఆయన హెచ్చరించారు.
Similar News
News April 7, 2025
మాజీ రైజర్సే దెబ్బ కొట్టారు!

GT నిన్న రాత్రి జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను మాజీ ఆటగాళ్లు గట్టి దెబ్బ తీశారు. గత సీజన్ వరకూ SRHలోనే ఉన్న వాషింగ్టన్ సుందర్ 29 బంతుల్లోనే 49 రన్స్‌తో లక్ష్య ఛేదనను సులువుగా మార్చేశాడు. అటు ఒకప్పటి రైజర్ సిరాజ్ బౌలింగ్‌లో 4 వికెట్లు తీసి హైదరాబాద్ బ్యాటింగ్ వెన్ను విరిచాడు. వీరిద్దరూ మన వద్ద ఉన్నప్పుడు ఎందుకు ఇలా ఆడలేదంటూ నెట్టింట సన్‌రైజర్స్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
News April 7, 2025
కొత్తగూడెం జిల్లాలో నేడు ప్రజావాణి రద్దు

భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేకం ఉన్నందున సోమవారం కొత్తగూడెం కలెక్టరేట్లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయి అధికారులు పట్టాభిషేక కార్యక్రమంలో ఉండటం వల్ల ప్రజావాణిని రద్దు చేసినట్లు చెప్పారు. కావున జిల్లా ప్రజలు ఎవరు కూడా తమ సమస్యలపై ప్రజావాణికి రావొద్దని సూచించారు.
News April 7, 2025
50కి పైగా దేశాలు మాతో బేరాలాడుతున్నాయి: US

ట్రంప్ విధించిన సుంకాలతో ప్రభావితమైన వాటిలో 50కి పైగా దేశాలు తమతో టారిఫ్‌ల తగ్గింపుపై బేరాలాడుతున్నాయని అమెరికా జాతీయ ఆర్థిక మండలి డైరెక్టర్ కెవిన్ హాసెట్ వెల్లడించారు. ‘దేశ ప్రయోజనాలే ట్రంప్‌కు ముఖ్యం. వేరే ఉద్దేశాలేం లేవు. అనేక దేశాలు ఇప్పుడు మాతో చర్చలు జరుపుతున్నాయి. సుంకాల వల్ల పెద్ద ఇబ్బంది అవుతుందని మేం భావించట్లేదు. మనకు ఎగుమతి చేసే దేశాలు తమ సుంకాల్ని తగ్గిస్తాయంతే’ అని వివరించారు.