News April 5, 2025
రామానాయుడు స్టూడియోకు నోటీసులు

AP: విశాఖలోని రామానాయుడు స్టూడియోకు నోటీసులు జారీ చేసినట్లు కలెక్టర్ హరీన్‌ధీర ప్రకటించారు. 2 వారాల సమయం ఇచ్చి, వారి వివరణ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో చిత్ర పరిశ్రమ, స్టూడియో నిర్మాణం కోసం 34 ఎకరాలకు పైగా భూమి కేటాయించామని, 15.17 ఎకరాలు హౌసింగ్ లేఅవుట్ కోసం మార్పు చేయాలని వారు ప్రతిపాదించారని తెలిపారు. ఇది నిబంధనలకు విరుద్ధమని, అందుకే నోటీసులు ఇస్తున్నట్లు హరీన్‌ధీర వెల్లడించారు.
Similar News
News April 10, 2025
APలో మరో ఘోరం.. మహిళను వివస్త్రను చేసి కొట్టిచంపారు?

AP: నెల్లూరు జిల్లాలో మహిళ దారుణ హత్య సంచలనం రేపుతోంది. ఆమెను వివస్త్రను చేసి భర్త, అత్తమామలు, ఆడబిడ్డ కొట్టిచంపినట్లు ప్రచారం జరుగుతోంది. కట్నం కోసం హత్య చేసి, ఆత్మహత్య చేసుకుందంటూ డ్రామా ఆడినట్లు సమాచారం. మహిళ మృతదేహన్ని నెల్లూరు GGHకు తరలించి, పోలీసులు విచారణ చేపట్టారు. భర్త, అత్తమామలు, ఆడపడుచు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
News April 10, 2025
అల్లు అర్జున్-అట్లీ మూవీ బడ్జెట్ రూ.800 కోట్లు?

అట్లీ డైరెక్షన్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించనున్న చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం సన్ పిక్చర్ ఏకంగా రూ.800 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇందులో హీరో రెమ్యునరేషన్ రూ.175 కోట్లు, డైరెక్టర్‌కు రూ.125 కోట్లు వెచ్చిస్తారని సమాచారం. దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
News April 10, 2025
ఒబామాతో విడాకుల రూమర్స్‌పై మిషెల్ స్పందన

US మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో విడాకుల వార్తలను మిషెల్ ఒబామా ఖండించారు. ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె ఈ ప్రచారం మహిళల స్వేచ్ఛపై దాడేనని మండిపడ్డారు. కొన్నాళ్లుగా ఒబామాతో కలిసి మిషెల్ ఈవెంట్లకు హాజరు కాకపోవడంతో విడాకుల ప్రచారం జోరందుకుంది. అయితే ఆ కార్యక్రమాలకు వెళ్లడమనేది తన వ్యక్తిగత విషయమే తప్ప వైవాహిక బంధంలో ఏర్పడిన వివాదాల వల్ల కాదన్నారు. ఇతరులనుకునేది చేయడం తన పని కాదని తేల్చి చెప్పారు.