News April 5, 2025
మంచిర్యాల: ‘మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి’

జిల్లాలో అవసరమున్న చోట మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని మంచిర్యాల జిల్లా BJP నాయకులు రామగుండం CP అంబర్ కిషోర్ ఝాను కోరారు. శనివారం ఆయన్ను CP కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ పకడ్బందీగా చేపట్టాలని, ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరారు. అధ్యక్ష కార్యదర్శులు వెంకటేశ్వర్ గౌడ్, అశోక్, తదితరులు ఉన్నారు.
Similar News
News July 7, 2025
కామారెడ్డి: విద్యుత్తు కార్యాలయంలో ప్రజావాణి

కామారెడ్డిలోని విద్యుత్తు కార్యాలయంలో సోమవారం విద్యుత్తు ప్రజావాణి నిర్వహించనున్నట్లు NPDCL ఎస్ఈ శ్రావణ్ కుమార్ తెలిపారు. NPDCL పరిధిలోని సబ్ డివిజన్, సెక్షన్, ఈఆర్వో సర్కిల్ కార్యాలయంలో ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి 1 వరకు అలాగే జిల్లా స్థాయిలో మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు వినతులు స్వీకరిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News July 7, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News July 7, 2025
GILL: ప్రపంచంలో ఒకే ఒక్కడు

టీమ్ ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రెండో టెస్టులో డబుల్ సెంచరీ, సెంచరీలతో రికార్డుల మోత మోగించారు. ఫస్ట్ క్లాస్ మ్యాచులో 400+, లిస్ట్ ఏ మ్యాచులో 200+, టీ20 మ్యాచులో 100+, వన్డేలో 200+, టెస్టులో 400+ రన్స్ కొట్టిన ఏకైక ప్లేయర్‌గా నిలిచారు. ప్రపంచంలో మరే ఆటగాడికి ఈ ఘనత సాధ్యం కాలేదు. కాగా రెండో టెస్టు మ్యాచులో గిల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన విషయం తెలిసిందే.