News April 5, 2025
NRPT: సమ సమాజ దార్శనికుడు బాబూ జగ్జీవన్ రామ్: కలెక్టర్

సమ సమాజ దార్శనికుడు బాబు జగ్జీవన్ రామ్ అని, ఆయన జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం నారాయణపేట కలెక్టరేట్‌లోని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్, ఎస్పీ యోగేశ్ గౌతమ్ హాజరై జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సేవలను కొనియాడారు.
Similar News
News July 6, 2025
‘విశాఖ కేంద్ర కారాగారంలో రూ.10 కోట్లతో కొత్త బ్యారక్’

ఏపీలో ఉన్న వివిధ జైళ్లను రూ.103 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు జైళ్ల శాఖ ఐజీ డా.ఇండ్ల శ్రీనివాస్ తెలిపారు. దీనికి సంబంధించి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ సిద్ధం చేసిన డిజైన్‌ను అప్రూవల్ కోసం ప్రభుత్వానికి పంపించామన్నారు. విశాఖ సెంట్రల్ జైల్లో రూ.10 కోట్లతో 250 మంది సామర్థ్యం గల కొత్త బ్యారక్ నిర్మాణం జరుగుతుందన్నారు. విశాఖ జైలుని సందర్శించిన ఆయన ఈ మేరకు వివరాలు తెలియజేశారు.
News July 6, 2025
వేంపల్లి: ట్రాక్టర్ ఢీ.. 50 గొర్రెలు మృతి

కడప జిల్లా వేంపల్లి మండలం నందిపల్లి- తాళ్లపల్లి మధ్యలో ట్రాక్టర్ ఢీకొని 50 గారెలు మృతి చెందినట్లు సమాచారం. ఈ గొర్రెలు తాటిమాకులపల్లె ఎస్సీ కాలనీకి చెందిన వారివిగా గుర్తించారు. వీరంతా తాళ్లపల్లిలో మేపుకోసం వెళ్తున్నారు. అటుగా స్పీడుగా వచ్చిన ట్రాక్టర్ గొర్రెలను ఢీకొనగా అక్కడికక్కడే 50 గొర్రెలు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News July 6, 2025
KNR నుంచి అరుణాచలానికి RTC ప్రత్యేక బస్సు

ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా అరుణాచలానికి KNR 1 డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ తెలిపారు. ఈ నెల 8న KNR బస్టాండ్ నుంచి బయలుదేరి 9న కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం తదుపరి రాత్రికి అరుణాచలం చేరుకుంటుందన్నారు. గిరిప్రదక్షిణ, దర్శనం అనంతరం 10న అరుణాచలం నుంచి మధ్యాహ్నం బయలుదేరుతుందన్నారు. మరుసటి రోజు జోగులాంబ దర్శనం తర్వాత 11వ తేదీ సాయంత్రం వరకు KNRకు చేరుకుంటుందన్నారు.