News April 5, 2025
HYD: అప్పులబాధతో యువకుడి ఆత్మహత్య

సికింద్రాబాద్ జీఆర్పీ పరిధిలో ఆన్‌లైన్ బెట్టింగ్‌లో డబ్బులు కోల్పోయిన యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సుచిత్ర BHEL క్వార్టర్స్‌లో నివసించే ప్రైవేట్ ఉద్యోగి రాజ్వీర్ సింగ్గాకూర్ (25) శనివారం తెల్లవారుజామున సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు కిందపడి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 7, 2025
ప్రేమికుడిపై కక్షతో ఫేక్ మెయిల్స్… చివరకు జైలు

ప్రేమ విఫలమైన ఓ యువతి ప్రేమికుడి పేరిట ఫేక్ బాంబు బెదిరింపు మెయిల్స్ పంపి కటకటాల పాలైంది. రోబోటిక్ ఇంజినీర్ రెనా జోషిల్డా(గుజరాత్) ప్రభాకర్ అనే సహచరుడిని ప్రేమించింది. అయితే ఆయన మరో పెళ్లి చేసుకోగా కక్షగట్టింది. ఆయన వర్చువల్ నంబర్‌తో అనేక రాష్ట్రాల స్కూళ్లు, కోర్టులు, స్టేడియాల్ని పేల్చేస్తున్నట్లు రెనా మెయిల్స్ పంపింది. 21 ప్రాంతాల్లో పోలీసులను పరుగులు పెట్టించి చివరకు బెంగళూరులో అరెస్టైంది.
News November 7, 2025
ఆక్వా రైతుల అభివృద్ధికి సహకారం అందించాలి: కలెక్టర్

జిల్లాలోని ఆక్వా రైతుల అభివృద్ధికి సహకారం అందించాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. శుక్రవారం న్యూఢిల్లీ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ జాయింట్ సెక్రటరీ నీతు కుమారి మత్స్య శాఖపై జిల్లా కలెక్టర్లు, మత్స్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భీమవరం కలెక్టరేట్ నుంచి హాజరైన కలెక్టర్ నాగరాణి, జాయింట్ సెక్రటరీ నీతు కుమారితో పలు కీలక అంశాలను తెలియజేశారు.
News November 7, 2025
తేనె మోతాదు మించితే మహా ప్రమాదం

ఆరోగ్యానికి మంచిదని ఇటీవల తేనెను ఎక్కువమంది స్వీకరిస్తున్నారు. అయితే దాని మోతాదు మించితే మొదటికే మోసమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులోని అధిక ఫ్రక్టోజ్ వల్ల ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. శరీరంలోని విషపదార్థాల తొలగింపులో కాలేయానిది ప్రధాన పాత్ర. అధిక తేనెతో దానిలో కొవ్వు పేరుకుపోయి పనితీరును నష్ట పరుస్తుంది. ఫలితంగా ఇతర సమస్యలూ వస్తాయి. అధిక క్యాలరీలు, కార్బోహైడ్రేట్స్ వల్ల బరువు పెరుగుతారు.


