News April 5, 2025
మంచిర్యాల: మరో మైలురాయిని చేరుకున్న సింగరేణి

బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి సంస్థ మరో కీలక మైలురాయిని చేరుకుందని INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ అన్నారు. సింగరేణి డైరెక్టర్(పా) వెంకటేశ్వర్లుతో యూనియన్ నాయకులు సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. తీవ్ర వర్షాలు, కఠినమైన వేసవి పరిస్థితుల మధ్య 69.01మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, 65.27మిలియన్ టన్నుల డిస్పాచ్‌ను సాధించి సింగరేణి సంస్థ అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తోందన్నారు.
Similar News
News April 7, 2025
కొత్తగూడెం జిల్లాలో నేడు ప్రజావాణి రద్దు

భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేకం ఉన్నందున సోమవారం కొత్తగూడెం కలెక్టరేట్లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయి అధికారులు పట్టాభిషేక కార్యక్రమంలో ఉండటం వల్ల ప్రజావాణిని రద్దు చేసినట్లు చెప్పారు. కావున జిల్లా ప్రజలు ఎవరు కూడా తమ సమస్యలపై ప్రజావాణికి రావొద్దని సూచించారు.
News April 7, 2025
50కి పైగా దేశాలు మాతో బేరాలాడుతున్నాయి: US

ట్రంప్ విధించిన సుంకాలతో ప్రభావితమైన వాటిలో 50కి పైగా దేశాలు తమతో టారిఫ్‌ల తగ్గింపుపై బేరాలాడుతున్నాయని అమెరికా జాతీయ ఆర్థిక మండలి డైరెక్టర్ కెవిన్ హాసెట్ వెల్లడించారు. ‘దేశ ప్రయోజనాలే ట్రంప్‌కు ముఖ్యం. వేరే ఉద్దేశాలేం లేవు. అనేక దేశాలు ఇప్పుడు మాతో చర్చలు జరుపుతున్నాయి. సుంకాల వల్ల పెద్ద ఇబ్బంది అవుతుందని మేం భావించట్లేదు. మనకు ఎగుమతి చేసే దేశాలు తమ సుంకాల్ని తగ్గిస్తాయంతే’ అని వివరించారు.
News April 7, 2025
పల్వంచ: తాళం వేసిన ఇంట్లో దొంగతనం

పల్వంచ మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన సాయిలు శనివారం రాత్రి తన ఇంటికి తాళం వేసి వెళ్లరు. తిరిగి వచ్చే సరికి గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగలగొట్టి బీరువాలోని మూడు తులాల బంగారం పుస్తెల తాడు, రూ.20,000 నగదును దొంగలించినట్లు పోలీసులు చెప్పారు. అదే గ్రామానికి చెందిన భువనగిరి రాజు ఇంటిలో కూడా తాళం పగలగొట్టి దొంగతనానికి పాల్పడినట్లు ఎస్ఐ అనిల్ ఆదివారం చెప్పారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.