News March 26, 2024

పాక్‌లో ఆరుగురు చైనీయుల హత్య

image

పాకిస్థాన్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఆరుగురు చైనీయులు దుర్మరణం చెందారు. ఈ ఘటన ఖైబర్ పఖ్తుంఖ్వాలో జరిగింది. చైనాకు చెందిన కొంతమంది ఇంజినీర్లు ఇస్లామాబాద్ నుంచి దాసుకు తమ కారులో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో వీరి వాహనాన్ని పేలుడు పదార్థాలతో కూడిన మరో వాహనం ఢీకొట్టింది. దీంతో భారీ విస్ఫోటనం జరిగి ఆరుగురు చైనీయులు అక్కడికక్కడే మృతిచెందారు. మరికొంతమందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.

Similar News

News March 22, 2026

వారంలో 10% తగ్గిన బంగారం ధర

image

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. గతవారంలో బంగారం ధర 10% తగ్గింది. 2011 తర్వాత ఇదే అతిపెద్ద క్షీణత. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, డాలర్ బలోపేతం కావడం వల్ల ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. దీంతో శుక్రవారం బంగారం ఔన్సు ధర 4,492 డాలర్లకు చేరింది. వెండి కూడా వారం రోజుల్లో 15% దిగొచ్చింది. దేశీయంగా MCXలో 10 గ్రాముల బంగారం ధర ₹1,44,825కు పడిపోగా కిలో వెండి ₹2,27,470 వద్ద ముగిసింది.

News March 22, 2026

రేపే మిట్టల్ ప్లాంట్‌కు శంకుస్థాపన

image

AP: అనకాపల్లి(D) నక్కపల్లి(M)లో ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ కంపెనీలు ఏర్పాటు చేయనున్న స్టీల్ ప్లాంట్‌కు CM చంద్రబాబు రేపు శంకుస్థాపన చేస్తారు. రూ.1,47,162CR పెట్టుబడితో నిర్మించే ఈ ప్లాంట్ వల్ల 60-65వేల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయని ప్రభుత్వం చెబుతోంది. మొదటి దశలో 7.3MT, రెండో దశలో 10.5MT ఉత్పత్తి.. 2033 నాటికి ప్లాంట్ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించింది.

News March 22, 2026

కాఫీ ఇలా తాగితే ఆరోగ్యం పక్కా!

image

చాలామంది కాఫీ తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని భయపడతారు. కానీ ఫిల్టర్ చేసిన బ్లాక్ కాఫీ లివర్, గట్ హెల్త్‌కు చాలా మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. నిద్రలేచిన 60 నుంచి 90 నిమిషాల తర్వాత తాగడం బెస్ట్ టైమ్. రోజుకు 1-3 కప్పుల వరకు ఓకే. చక్కెర కలపకుండా తాగడం ముఖ్యం. అలాగే ఖాళీ కడుపుతో తాగొద్దు. ఆర్గానిక్ కాఫీ గింజలైతే బ్రెయిన్ షార్ప్‌గా ఉండటమే కాకుండా అల్జీమర్స్ వంటి రిస్కులు తగ్గుతాయి.