News April 5, 2025
‘ఎంపురాన్’ డైరెక్టర్‌కు ఐటీ నోటీసులు

మోహన్‌లాల్ నటించిన L2 ఎంపురాన్ డైరెక్టర్, నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. 2022లో ఆయన నటించి, సహ నిర్మాతగా వ్యహరించిన 3 సినిమాల వల్ల పొందిన ఆదాయ వివరాలను వెల్లడించాలని ఆదేశించింది. ఈనెల 29 వరకు సుకుమారన్‌కు గడువు విధించింది. కాగా 2022లోనూ పృథ్వీరాజ్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. మరోవైపు నిన్న ఎంపురాన్ ప్రొడ్యూసర్ ఇంటిపై ఈడీ రైడ్స్ చేసింది.
Similar News
News April 7, 2025
GOOD NEWS: రెండున్నరవేల ఖాళీలు భర్తీ

TG: వర్సిటీల్లో ఉద్యోగాల కోసం 15ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 12 వర్సిటీల్లో ఖాళీగా ఉన్న రెండున్నరవేలకుపైగా అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్‌ను భర్తీ చేసేందుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
News April 7, 2025
ఇంటర్ ఫలితాలు వచ్చేది అప్పుడేనా?

TG: ఈ నెల 24 లేదా 25న ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. 10వ తేదీతో జవాబు పత్రాల మూల్యాంకనాన్ని పూర్తి చేసి, ఆ తర్వాతి 2 రోజుల పాటు మార్కుల ఎంట్రీ, మార్కుల జాబితాల ముద్రణ పూర్తి చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్ సెట్‌కంటే ముందే ఫలితాల్ని వెల్లడించాలని ఇంటర్ బోర్డు భావిస్తున్నట్లు సమాచారం.
News April 7, 2025
అబుదాబిలో ఘనంగా రామనవమి వేడుకలు

అబుదాబీలోని బాప్స్ ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. నవమి వేడుకలతో పాటు స్వామి నారాయణ జయంతి సందర్బాన్ని ఆలయ నిర్వాహకులు అద్భుతంగా జరిపించారు. యూఏఈ వ్యాప్తంగా ఉన్న భక్తులు వందలాదిగా కార్యక్రమానికి తరలివచ్చారని వారు తెలిపారు. రామ భజనలతో జన్మోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నామని, హైందవ విలువలకు, శాంతి-ఐక్యతకు కార్యక్రమం ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు.