News April 5, 2025

నిమ్స్‌లో చిన్నారులకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు

image

HYD నిమ్స్ ఆసుపత్రిలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయనున్నారు. మిలీనియం బ్లాక్‌లో ఏర్పాటు చేసిన పీడియాట్రిక్ కార్డియాక్ ఐసీయూలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. డాక్టర్ మాలెంపాటి అమరేశ్ రావు నేతృత్వంలో ఈ శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు. తల్లిదండ్రుల ఆధార్, రేషన్ కార్డు లేదా జనన ధ్రువీకరణ పత్రంతో ఉ.10 నుంచి సా.4 వరకు పాత భవనం మొదటి అంతస్తు ఆరో వార్డులో సంప్రదించాలి.

Similar News

News April 7, 2025

రేపు అహ్మదాబాద్‌కు సీఎం రేవంత్

image

TG: గుజరాత్‌లో రేపు, ఎల్లుండి జరిగే ఏఐసీసీ సమావేశాలకోసం సీఎం రేవంత్ రేపు అహ్మదాబాద్‌కు వెళ్లనున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు, పలువురు కీలక నేతలు ఈరోజు సాయంత్రమే బయలుదేరనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నుంచి మొత్తం 44మంది నేతలకు ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. జాతీయస్థాయిలో అనుసరించాల్సిన విధానాలు, వ్యూహాలపై ఈ సమావేశాల్లో చర్చకు వస్తాయని సమాచారం.

News April 7, 2025

రేపు సింహాద్రి అప్పన్న కళ్యాణం

image

AP: ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం రేపు అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రతి ఏటా చైత్ర శుద్ధ ఏకాదశి పర్వదినాన స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈరోజు రాత్రి అంకురార్పణతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. రేపు మధ్యాహ్నం కొట్నాల ఉత్సవం, ఎదురు సన్నాహం పూర్తవుతాయి. రాత్రి 8గంటలకు రథోత్సవం, 9.30గంటలకు స్వామి కళ్యాణ మహాత్సవం జరుగుతాయి.

News April 7, 2025

అఖిల్ నెక్స్ట్ మూవీ.. రేపు గ్లింప్స్?

image

అక్కినేని అఖిల్ ఎట్టకేలకు మరో ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. ‘ఏజెంట్’ వచ్చి రెండేళ్లైనా ఆయన మరే ప్రాజెక్టునూ అనౌన్స్ చేయని సంగతి తెలిసిందే. తాజాగా ఫ్యాన్స్‌కు అఖిల్ టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆయన కొత్త సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను రేపు ఉదయం రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సినిమాతోనైనా అఖిల్ బ్లాక్ బస్టర్ కొట్టాలని ఫ్యాన్స్ విష్ చేస్తున్నారు.

error: Content is protected !!