News April 5, 2025
KMR: లోన్ యాప్స్ వేధింపులకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బలి

ఆన్‌లైన్ లోన్ యాప్‌ల వేధింపులు భరించలేక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సదాశివనగర్‌కు చెందిన సందీప్(29) HYDలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం సందీప్ ఆన్‌లైన్ లోన్ యాప్స్ ద్వారా రుణం తీసుకున్నాడు. ఏజెంట్లు ఇబ్బందులు పెట్టడంతో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 3, 2025
నస్పూర్: పరిపాలన సులభతరం చేసేందుకు గ్రామ పాలనాధికారులు

గ్రామీణ స్థాయిలో పరిపాలన సులభతరం చేసేందుకు ప్రభుత్వం గ్రామ పాలనాధికారుల నియామక ప్రక్రియ చేపట్టిందని రాష్ట్ర ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ లోకేశ్ కుమార్ సూచించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 5న హైదరాబాద్‌లో సీఎం చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
News September 3, 2025
ఎలాంటి TRS ఎలా అయిపోయింది..

ప్రత్యేక తెలంగాణ కోసం ఏర్పడిన TRS దాదాపు పదేళ్లు అధికారంతో వర్థిల్లింది. ఆ పార్టీ పేరు చెప్పగానే KCR, హరీశ్‌రావు, KTR, కవితే గుర్తొచ్చేవారు. అలాంటి పార్టీ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది. BRSగా రూపాంతరం చెందడం, 2023 ఎన్నికల్లో ఓటమి పార్టీ రూపురేఖల్ని మార్చింది. ఆపై పలువురు MLAలు BRSను వీడగా, ఇప్పుడు KCR కూతురే దూరమవడం పార్టీ పరిస్థితికి అద్దం పడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
News September 3, 2025
NGKL: ఈనెల 5న జీపీఓ నియామక పత్రాల అందజేత: కలెక్టర్

ఈనెల 5న HYDలోని హైటెక్స్ లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జీపీఓ నియామక పత్రాల అందజేత కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ బాదావత్ సంతోష్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నియామక పత్రాలు అందుకోవడానికి ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్ కుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వివరాలు వెల్లడించారు.