News April 5, 2025
రైతులను వ్యాపారవేత్తలుగా మార్చుతాం: శ్రీధర్ బాబు

TG: ట్రంప్ టారిఫ్స్ విధానంతో భారత్‌కు ఒక విధంగా మేలే జరుగుతుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇండియా, లాటిన్ అమెరికా, కరేబియన్ ప్రతినిధుల సదస్సులో ఆయన మాట్లాడారు. సుంకాల పెంపుతో ఇతర దేశాల వ్యాపారవేత్తలు భారత్ వైపు చూస్తున్నారన్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్‌ను ప్రోత్సహించి రైతులను వ్యాపారవేత్తలుగా మార్చుతామని తెలిపారు.
Similar News
News April 7, 2025
నేడు కొత్త ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం

TG: ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నికైన అభ్యర్థులు ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్నారు. పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ కోటాలో అంజిరెడ్డి, మల్క కొమురయ్య, శ్రీపాల్ రెడ్డి గెలిచారు. ఎమ్మెల్యే కోటాలో విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, దాసోజు శ్రవణ్ ఎన్నికయ్యారు. ఉ.11 గంటలకు శాసనమండలిలో ఛైర్మన్ గుత్తా ప్రమాణం చేయిస్తారు. దాసోజు మరోరోజు ప్రమాణ స్వీకారం చేస్తారని BRS తెలిపింది.
News April 7, 2025
బాలీవుడ్‌లోకి తెలుగు హీరోయిన్ ఎంట్రీ!

తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. మల్లేశం, వకీల్ సాబ్ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన ఈ బ్యూటీ రాకేశ్ జగ్గి దర్శకత్వంలో నటిస్తున్నారని సినీ వర్గాల్లో టాక్. ఈ మూవీలో ఆమె డీగ్లామర్ రోల్‌లో కనిపించనుండగా ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైందని సమాచారం. త్వరలోనే సినిమా గురించి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశముంది.
News April 7, 2025
ఆరడుగుల బస్సులో ఏడడుగుల కండక్టర్.. వైరలవడంతో!

TG: తన ఎత్తు కారణంగా కండక్టర్‌గా పనిచేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అహ్మద్‌పై వచ్చిన వార్తలపై మంత్రి పొన్నం స్పందించారు. 7ft ఉన్న అహ్మద్ మెహదీపట్నం(HYD) డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నారు. బస్సులోపల 6.4ftల ఎత్తే ఉండటంతో మెడ వంచి ఉద్యోగం చేయడంతో మెడ, వెన్నునొప్పి వచ్చి ఆస్పత్రి పాలవుతున్నారు. ఇది CM రేవంత్ దృష్టికి వచ్చిందని, అతనికి RTCలో సరైన ఉద్యోగం ఇవ్వాలని RTC ఎండీ సజ్జనార్‌కు సూచించారు.