News April 5, 2025
పాలమూరు నేతలతో KCR మీటింగ్.. BRS శ్రేణుల్లో జోష్..!

ఏప్రిల్ 27న వరంగల్‌లో BRS భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో MBNR, GDWL, NRPT, NGKL, WNP జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు, మాజీ MLAలు,ఇతర ముఖ్య నేతలతో ఈరోజు మాజీ సీఎం KCR సమావేశం నిర్వహించారు. జన సమీకరణ, ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న KCR ప్రజాక్షేత్రంలోకి వస్తుండడంతో BRSశ్రేణుల్లో జోష్ నిండింది. భారీగా సభకు తరలివెళ్లి పాలమూరు సత్తా చాటుతామని నేతలు తెలిపారు.
Similar News
News April 10, 2025
నెల్లూరు జిల్లాలో దారుణం

నెల్లూరు జిల్లా ఊటుకూరు పెద్దపట్టపుపాళెంలో దారుణం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. వరకట్నం కోసం సుగుణమ్మను వివస్త్రని చేసి భర్త, అత్తమామలు, ఆడబిడ్డ దాడి చేశారు. ఈ విషయం బయటకొస్తుందని ఆపై కొట్టి చంపేశారు. కళ్లాపి రంగు తాగి ఆత్మహత్య చేసుకుందని హైడ్రామా సృష్టించారు. భర్త హరికృష్ణ, అత్తమామలు నాగూర్, నర్సమ్మ, ఆడబిడ్డ నాగలక్ష్మి పరారయ్యారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News April 10, 2025
MBNR: ఏప్రిల్ 13న అంబేడ్కర్ విగ్రహావిష్కరణ

మహబూబ్‌గర్ జిల్లా నవాబ్‌పేట మండలం కారుకొండ గ్రామంలో అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 13న అంబేడ్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవం ఉంటుందని తెలంగాణ మాల మహానాడు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు చెన్నకేశవులు తెలిపారు. అతిథులుగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, ఎంపీ డీకే అరుణ, లక్ష్మారెడ్డి, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య, మంత్రి నరసింహయ్య రానున్నారని చెప్పారు.
News April 10, 2025
APలో మరో ఘోరం.. మహిళను వివస్త్రను చేసి కొట్టిచంపారు?

AP: నెల్లూరు జిల్లాలో మహిళ దారుణ హత్య సంచలనం రేపుతోంది. ఆమెను వివస్త్రను చేసి భర్త, అత్తమామలు, ఆడబిడ్డ కొట్టిచంపినట్లు ప్రచారం జరుగుతోంది. కట్నం కోసం హత్య చేసి, ఆత్మహత్య చేసుకుందంటూ డ్రామా ఆడినట్లు సమాచారం. మహిళ మృతదేహన్ని నెల్లూరు GGHకు తరలించి, పోలీసులు విచారణ చేపట్టారు. భర్త, అత్తమామలు, ఆడపడుచు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.