News April 5, 2025
వక్ఫ్ బోర్డు పేరుతో భూ ఆక్రమణలు ఉండవు: యోగి ఆదిత్యనాథ్

వక్ఫ్ బోర్డు పేరుతో భూఆక్రమణలు చేయటం ఇక సాధ్యపడదని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. UPలో లక్షల ఎకరాల భూమిని వక్ఫ్ పేరుతో ఆక్రమించారని ఆరోపించారు. ప్రభుత్వ భూములను ఆస్పత్రులు, కళాశాలలు వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించవచ్చని పేర్కొన్నారు. ఈ బిల్లు తీసుకొచ్చినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిన సంగతి తెలిసిందే.
Similar News
News April 7, 2025
అల్పపీడనం.. 4 రోజులు వర్షాలు

బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో పలు చోట్ల నేటి నుంచి 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు ద్రోణి ప్రభావంతో తెలంగాణలో కొన్ని చోట్ల నేటి నుంచి మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. అదే సమయంలో కొన్ని చోట్ల ఎండలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.
News April 7, 2025
ఆరు రోజుల్లో 1.27 కోట్ల మందికి సన్నబియ్యం

TG: రాష్ట్రంలో సన్నబియ్యం రేషన్ పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటివరకు 1.27 కోట్ల మంది సన్నబియ్యం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 90.42 లక్షల రేషన్ కార్డులుండగా ఏప్రిల్‌లో 42 లక్షల కార్డులపై లబ్ధిదారులు బియ్యం తీసుకున్నారు. ఈ ఆరు రోజుల్లోనే 8.75 లక్షల క్వింటాళ్ల బియ్యం సరఫరా చేశారు. పలు చోట్ల రవాణా, సాంకేతిక సమస్యలతో పంపిణీ నెమ్మదిగా సాగుతున్నా ఈ నెల 15వరకు పూర్తవుతుందని అధికారులు పేర్కొన్నారు.
News April 7, 2025
VIRAL: జీనియస్ డైరెక్టర్‌తో యంగ్ టైగర్

యంగ్ టైగర్ NTR, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ ఇద్దరూ తాజాగా మీట్ అయ్యారు. ఈ సందర్భంగా వారు హగ్ చేసుకున్న ఫొటోను సుకుమార్ భార్య తబిత ఇన్‌స్టాలో పంచుకున్నారు. ‘తారక్‌కి ప్రేమతో’ అన్న క్యాప్షన్ ఇచ్చారు. రీపోస్ట్ చేసిన NTR, ‘నన్ను ఎప్పుడూ వెంటాడే ఎమోషన్ సుకుమార్’ అని రాసుకొచ్చారు. దీంతో వీరి కాంబోలో మరో మూవీ రాబోతుందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ‘నాన్నకు ప్రేమతో’ మూవీకి వీరు కలిసి పనిచేశారు.