News April 5, 2025

BRS రజతోత్సవ సభ.. ఖమ్మం నేతలతో KCR MEETING

image

బీఆర్ఎస్ ఆవిర్భావ, రజతోత్సవ మహాసభ నేపథ్యంలో ఈరోజు ఉమ్మడి ఖమ్మంతో పాటు మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాల ముఖ్యనేతలతో పార్టీఅధినేత కేసీఆర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, వనమా వెంకటేశ్వరరావు, బానోత్ మదన్ లాల్ నాయక్, హరిప్రియ నాయక్, మెచ్చా నాగేశ్వరరావు, కమల్ రాజ్ పాల్గొన్నారు.

Similar News

News April 7, 2025

ఖమ్మం: తగ్గిన కోళ్ల ఉత్పత్తి.. పెరిగిన చికెన్ ధరలు

image

ఖమ్మం జిల్లాలో చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. బర్డ్ ఫ్లూ భయంతో రెండు నెలల క్రితం కేజీ రూ.140 నుంచి రూ.180, స్కిన్‌లెస్ రూ.220 నుంచి రూ.240 వరకు పలికింది. ఈనెలలో మాత్రం ఏకంగా రూ.280 నుంచి రూ.300 వరకు పలుకుతోంది. బర్డ్ ఫ్లూ భయం తొలగడంతో చికెన్‌కు డిమాండ్ పెరిగింది. వేసవి కారణంగా కోళ్ల ఉత్పత్తి తగ్గడంతో ధరలు అమాంతం పెరిగినట్లు తెలుస్తోంది.

News April 7, 2025

ఖమ్మం జిల్లా ప్రజలకు CM గుడ్ న్యూస్

image

శ్రీరామనవమి సందర్భంగా ఖమ్మం జిల్లా రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.13,057 కోట్లను సవరించి రూ.19,324 కోట్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. అలాగే కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుకు కూడా ఆమోదం లభించింది. దీంతో ఉమ్మడి జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News April 6, 2025

భద్రాచలం: తలంబ్రాల కౌంటర్ల వద్ద భక్తుల కిటకిట

image

భద్రాచలం సీతారాముల కళ్యాణ వేడుకను కనులారా వీక్షించేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. దీంతో లడ్డూ ప్రసాదంతోపాటు మహా ప్రసాదం, స్వామివారి తలంబ్రాల కౌంటర్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అటు ఆలయ పరిసరాలతో పాటు పట్టణంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కాగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆలయ పరిసరాల్లో పహారా కాస్తున్నారు.

error: Content is protected !!