News April 5, 2025
మచిలీపట్నం: పీజీ సెట్ కోసం KUలో సమాచార కేంద్రం

పీజీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్ధుల కోసం కృష్ణా విశ్వవిద్యాలయంలో సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ డా ఎల్. సుశీల తెలిపారు. పీజీ సెట్-2025కు సంబంధించిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఈనెల 2 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు.
Similar News
News April 7, 2025
అవనిగడ్డ: పండుగ రోజు విషాదం.. ముగ్గురి మృతి

శ్రీరామ నవమి పండుగ రోజు మోదుమూడిలో ఆనందం కన్నీటిగా మారింది. రాములోరి ఊరేగింపులో భాగంగా కృష్ణా నదిలో రామ స్తూపాన్ని శుద్ధిచేస్తుండగా ముగ్గురు బాలురు నీటమునిగి మృతిచెందిన విషయం తెలిసిందే. వీరిలో ఇద్దరు అన్నదమ్ముల సంతానం కావడం, ఒకే కుటుంబానికి వారసులుగా ఉండటం గ్రామాన్ని విషాదంలో ముంచెత్తింది. వీరబాబు, వెంకట గోపి కిరణ్, వర్ధన్‌లు మృతిచెందిన వారిలో ఉన్నారు.
News April 7, 2025
MTM: రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

మచిలీపట్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు ఆయా కార్యాలయాలలో అర్జీలు ఇవ్వవచ్చన్నారు.
News April 6, 2025
కృష్ణా: నదిలో ముగ్గురు గల్లంతు, ఒకరి మృతి

అవనిగడ్డలో పండుగ వేళ విషాదం చోటు చేసుకుంది. ఆదివారం అవనిగడ్డ (మ) మోదుమూడి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు అవనిగడ్డ శివారు కొత్తపేట వద్ద కృష్ణానదిలో ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. స్థానికులు గమనించి సహాయక చర్యలు చేపట్టే లోపే ముగ్గురిలో వెంకట గోపి కిరణ్ మరణించాడు. మరో ఇద్దరి కోసం డీఎస్పీ విద్యశ్రీ, సీఐ యువ కుమార్, ఎస్ఐ శ్రీనివాస్, సిబ్బంది గాలిస్తున్నారు.