News April 5, 2025

దామెర: తండ్రికి తల కొరివి పెట్టిన కుమార్తె..!

image

హనుమకొండ జిల్లా దామెర మండల పరిధి లాదెల్ల గ్రామంలో లాదెల్ల బిక్షపతి శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మరణించారు. భిక్షపతికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు లేకపోవడంతో కుమారుడి బాధ్యత పెద్ద కుమార్తె అయిన శోభారాణి తీర్చారు. మృతుడి దహన సంస్కారాలకు హాజరైన బంధుమిత్రులు, గ్రామ ప్రజలు శోభారాణి తలకొరివి పెట్టడం చూసి కన్నీరు మున్నీరయ్యారు.

Similar News

News April 7, 2025

నేడు కొత్త ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం

image

TG: ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నికైన అభ్యర్థులు ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్నారు. పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ కోటాలో అంజిరెడ్డి, మల్క కొమురయ్య, శ్రీపాల్ రెడ్డి గెలిచారు. ఎమ్మెల్యే కోటాలో విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, దాసోజు శ్రవణ్ ఎన్నికయ్యారు. ఉ.11 గంటలకు శాసనమండలిలో ఛైర్మన్ గుత్తా ప్రమాణం చేయిస్తారు. దాసోజు మరోరోజు ప్రమాణ స్వీకారం చేస్తారని BRS తెలిపింది.

News April 7, 2025

విశాఖలో కేజీ అల్లం ధర ఎంతంటే?

image

విశాఖ 13 రైతు బజార్లలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు సోమవారం కాయగూరల ధరలను విడుదల చేశారు. (రూ. కిలో) టమాట రూ.17, ఉల్లిపాయలు రూ.22, బంగాళా దుంపలు రూ.17, బెండకాయలు రూ. 28, కాకరకాయలు రూ.34, క్యారెట్ రూ.32/34, మునగ కాడలు రూ.24, అల్లం రూ.48, బరబాటి రూ.30, బీట్రూట్ రూ.24, బీన్స్ రూ.50, పాటల్స్ రూ.64, చామ రూ.26, దేవుడు చిక్కుడు రూ.60, గ్రీన్ పీస్ రూ.60గా ధరల నిర్ణయించారు.

News April 7, 2025

తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నర్సంపేట వాసుల ప్రతిభ

image

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన కరాటే క్రీడాకారులు తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ప్రతిభ కనబర్చారు. వరంగల్‌లో ఆదివారం నిర్వహించిన పోటీల్లో నర్సంపేటకు చెందిన కరాటే క్రీడాకారులు రెండు గంటల పాటు పార్టిసిపేట్ చేశారు. ప్రత్యేక సర్టిఫికెట్‌ను అందుకున్నారు. కోచ్‌లు జానీ మాస్టర్, శ్రీనాథ్, ఆరుగురు విద్యార్థులను నిర్వాహకులు అభినందించారు.

error: Content is protected !!