News April 5, 2025

సీతమ్మ తల్లికి సిరిసిల్ల నుంచి బంగారు పట్టు చీర

image

భద్రాచలంలో జరగనున్న సీతారాముల కళ్యాణానికి ఒక భక్తుడు బంగారంతో తయారుచేసిన పట్టుచీరను కానుకగా సమర్పించారు. సిరిసిల్లకు చెందిన హరిప్రసాద్ గత మూడేళ్లుగా సీతమ్మ తల్లికి కళ్యాణం రోజు పట్టుచీర తయారుచేసి సమర్పిస్తున్నారు. ఈసారి రూ.35 వేల విలువగల బంగారు పట్టుచీరను తయారుచేసి భద్రాచలంలో సమర్పించారు. చీరపై సీతారాముల విగ్రహాలను చిత్రీకరించినట్లు తెలిపారు.

Similar News

News April 7, 2025

అశ్వారావుపేట: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

image

అశ్వారావుపేట శివారులో రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు.. అశ్వారావుపేటకు చెందిన జీసీసీ రేషన్ డీలర్ భూక్యా కృష్ణ మండలం కావడిగుండ్లలో విధులు ముగించుకుని ఇంటికి వస్తున్నాడు. ఈక్రమంలో దొంతికుంట సమీపంలో వాగొడ్డుగూడెం వైపు వెళ్తున్న మరో బైక్ ఢీకొంది. ఈ ఘటనలో డీలర్ కృష్ణకు కుడికాలు విరగ్గా వాగొడ్డుగూడెంకు చెందిన నాగరాజు, గంగారంకి చెందిన రాజుకు గాయాలయ్యాయి.

News April 7, 2025

మేడ్చల్ మల్కాజిగిరిలో జీవో 59 అమలులో జాప్యం!

image

మేడ్చల్ జిల్లా పరిధిలో అనేక ప్రాంతాల్లో జీవో నంబర్ 59 కింద దరఖాస్తు చేసిన ప్రజలు 16 నెలలుగా సమస్యల పరిష్కారానికి ఎదురుచూస్తున్నారు. అనేక ఇళ్లకు అధికారిక గుర్తింపులేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ, అర్బన్ ల్యాండ్ సీలింగ్ (ULC) చట్టం కింద వచ్చిన సర్‌ప్లస్ భూముల్లో నిర్మాణాలు చేపట్టిన వారికి జీవో ప్రకారం కొన్ని షరతుల మేరకు, చెల్లింపుల ఆధారంగా భూమిని రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించారు.

News April 7, 2025

తెలంగాణ ప్రభుత్వంపై బాలీవుడ్ నటి ఫైర్

image

HYD కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బాలీవుడ్ నటి దియా మిర్జా తెలంగాణ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ‘కంచ గచ్చిబౌలి పరిస్థితి గురించి తెలంగాణ సీఎం నిన్న ఒక ట్వీట్ చేశారు. నేను నకిలీ AI ఫొటోలు/ వీడియోలు ఉపయోగించానని చెప్పారు. ఇది పూర్తిగా తప్పుడు ప్రకటన. నేను పోస్ట్ చేసినవి ఒరిజినల్ వీడియోలు. ఇటువంటి వాదనలు చేసే ముందు మీడియా, ప్రభుత్వం వాస్తవాలను ధ్రువీకరించుకోవాలి’ అని ఆమె Xలో రాసుకొచ్చారు.

error: Content is protected !!