News April 5, 2025

ఏఐ ప్రజాస్వామ్యానికే పెను సవాల్ విసిరింది: సీఎం రేవంత్

image

TG: కంచ గచ్చిబౌలి వ్యవహారంలో AIని ఉపయోగించి వివాదం సృష్టించారని CM రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘AIతో నెమళ్లు ఏడ్చినట్లు, జింకలు గాయపడినట్లు ఫేక్ ఫొటోలు, వీడియోలు సృష్టించారు. వాటినే సెలబ్రిటీలు రీపోస్ట్ చేసి సమాజానికి తప్పుడు సందేశం పంపారు. ఈ వివాదం ప్రజాస్వామ్యానికే పెను సవాలు విసిరింది. దేశ సరిహద్దుల్లో ఘర్షణ జరుగుతోందంటూ ఫేక్ వీడియో క్రియేట్ చేస్తే యుద్ధాలు జరిగే ప్రమాదం ఉంది’ అని అన్నారు.

Similar News

News April 7, 2025

ఐటీ నోటీసులకు భయపడం: పృథ్వీరాజ్ తల్లి

image

రెమ్యునరేషన్ వివరాలు వెల్లడించాలని దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌కు ఐటీ నోటీసులు రావడంపై ఆయన తల్లి మల్లిక స్పందించారు. తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని, దర్యాప్తునకు భయపడేది లేదని చెప్పారు. అంతకుముందు సినిమా విషయంలో వివాదం చెలరేగగా పృథ్వీరాజ్‌కు స్టార్ హీరో మమ్ముట్టి అండగా ఉండటం తనను కదిలించిందని తెలిపారు. తన కొడుకుకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.

News April 7, 2025

STOCK MARKETS: రూ.19 లక్షల కోట్ల నష్టం!

image

భారత స్టాక్ మార్కెట్స్ సెషన్ ప్రారంభంలోనే సుమారు రూ.19 లక్షల కోట్లు కోల్పోయినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. సెన్సెక్స్ 3939, నిఫ్టీ 1160 పాయింట్ల మేర నష్టాలతో ప్రారంభమయ్యాయి. 2020 మార్చి తర్వాత ఇదే అత్యల్పం. మొత్తంగా 5 శాతానికి పైగా సంపద ఆవిరైంది. ఐటీ, మెటల్ సూచీలు 7 శాతం నష్టపోయాయి. మరోవైపు చైనా, జపాన్, కొరియా తదితర దేశాల మార్కెట్లు సైతం కుప్పకూలాయి.

News April 7, 2025

మూడు రోజుల్లో ₹3000 తగ్గిన బంగారం ధరలు!

image

అమెరికా విధించిన సుంకాలతో బంగారం ధరల పతనం కొనసాగుతోంది. ఇవాళ కూడా స్వల్పంగా బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి నేడు ₹280 తగ్గి ₹90,380కి చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ ₹250 తగ్గి ₹82,850గా పలుకుతోంది. అటు వెండి ధర కూడా రూ.100 తగ్గడంతో కేజీ రూ.1,02,900కి చేరింది. కాగా, గత మూడు రోజుల్లోనే కేజీ వెండిపై రూ.9,100, తులం బంగారంపై రూ.3000 తగ్గడం విశేషం.

error: Content is protected !!