News April 5, 2025

సిద్దవటం: బావిలో ఈతకొడుతూ ఫిట్స్.. విద్యార్థి మృతి

image

సిద్దవటం మండలంలోని ముమ్మడిగుంటపల్లిలో శనివారం విషాదం నెలకొంది. గ్రామస్థుల వివరాల ప్రకారం వ్యవసాయ పొలాల్లోని బావిలో శనివారం ఈతకొడుతూ 10వ తరగతి విద్యార్థి తమ్మిశెట్టి శ్రీనివాసులు మృతి చెందాడు. ఒంటిమిట్ట మండలం చిన్న కొత్తపల్లికి చెందిన తమ్మిశెట్టి శ్రీనివాసులు స్నేహితులతో కలిసి ముమ్మడిగుంటపల్లి వ్యవసాయ పొలాల్లోని బావిలో ఈతకొడుతూ బయటకు రాగానే ఫిట్స్ వచ్చి మృతిచెందినట్లు బంధువులు తెలిపారు.

Similar News

News April 7, 2025

కడప: నదిలో యువకుడి గల్లంతు

image

కడప నగర సమీపాన ఉన్న వాటర్ గండిలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. నగరంలోని రియాజ్ థియేటర్ సమీపంలోని సమీర్ (17) తన స్నేహితులతో కలిసి ఈత కోసం ఆదివారం పెన్నానదిలోకి దిగారు. ప్రమాదవశాత్తు ముగ్గురూ అందులో మునిగారు. స్థానికులు గమనించి అందులో ఇద్దరిని కాపాడారు. సమీర్ కనిపించలేదని తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 7, 2025

బద్వేల్: అత్తింటికే కన్నం వేసిన అల్లుడు

image

అత్తింటికే అల్లుడు కన్నం వేసిన ఘటన బద్వేల్లో చోటు చేసుకుంది. గోపవరం(M) T.సండ్రపల్లెకు చెందిన పిచ్చయ్య, పెంచలమ్మ కొన్నేళ్లుగా బద్వేల్‌లోని తెలుగుగంగ కాలనీలో ఉంటున్నారు. పెద్ద కూతురుకి మురళితో వివాహం చేశారు. ఇటీవల పిచ్చయ్య అనారోగ్యంతో చనిపోయారు. అంత్యక్రియల కోసం T.సండ్రపల్లెకు వెళ్లారు. ఇదే అదునుగా బద్వేల్‌లోని అత్త ఇంట్లోకి మురళి చొరబడి రూ.7 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లాడు. చివరికి కటకటాల పాలయ్యాడు.

News April 7, 2025

ఒంటిమిట్టకు రాష్ట్ర మంత్రుల రాక

image

రాష్ట్ర మంత్రుల బృందం సోమవారం ఒంటిమిట్టకు వస్తున్నట్టు జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఇన్‌ఛార్జ్ మంత్రి సవిత, మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఒంటిమిట్టలో కోదండ రామునికి పూజలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. అనంతరం మహానాడు ఏర్పాట్లను పరిశీలిస్తారని చెప్పారు.

error: Content is protected !!